Begin typing your search above and press return to search.

క‌టౌట్లు పెడితే కాసులు రాల్తాయా?

By:  Tupaki Desk   |   23 Oct 2019 1:30 AM GMT
క‌టౌట్లు పెడితే కాసులు రాల్తాయా?
X
క‌టౌట్లు పెడితే కాసులు కురుస్తాయా? క‌ంటెంట్ లో మ్యాట‌ర్ ఉంటేనే ఈరోజుల్లో జ‌నాల్ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌గ‌లరు. క‌టౌట్లు.. ఊరంతా ఫ్లెక్సీలు క‌ట్టినంత మాత్రాన జ‌నం థియేట‌ర్ల‌కు రారు. జ‌నాల మౌత్ టాక్.. పాజిటివ్ రివ్యూలు చాలా ప్ర‌భావితం చేస్తున్నాయి. అయితే వీట‌న్నిటినీ విస్మ‌రించి హీరోల‌కు భారీ క‌టౌట్లు పెడుతూ ఫ్యాన్స్ చేసే హంగామా మామూలుగా ఉండ‌దు. ఇక‌పోతే ఇదంతా టాలీవుడ్ అగ్ర హీరోల విష‌యంలో ఉండే హ‌డావుడి. కానీ ఇప్పుడు రూల్స్ ని మార్చారు. ఇక‌పై తెలుగు గ‌డ్డ‌పై కోలీవుడ్ అగ్ర హీరోల‌కు 50 అడుగుల క‌టౌట్లు ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాయి. అది కూడా హైద‌రాబాద్ మెట్రో న‌గ‌రంలోని సినిమా కేంద్రం అయిన ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో. ఇన్నేళ్ల‌లో ర‌జ‌నీకాంత్-క‌మ‌ల్ హాస‌న్- అజిత్- సూర్య‌- కార్తీ వంటి త‌మిళ‌ అగ్ర హీరోల‌కే లేని సీన్ ఆ హీరోకి క్రియేట్ చేస్తున్నారు మ‌రి. ఆయ‌నేమైనా ఇక్క‌డ తోపా అంటే అదీ లేదు.

ఆ హీరో ఎవ‌రు? అని ఇంకా మ‌న జ‌నాలు అడిగే ప‌రిస్థితి ఉంది. కానీ అప్పుడే 50 అడుగుల క‌టౌట్ రెడీ అయిపోతోంద‌ట‌. త‌మిళ‌నాడులో అగ్ర క‌థానాయ‌కుడిగా ఓ వెలుగు వెలుగుతున్న ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్ కి టాలీవుడ్ లో అలాంటి సీన్ క్రియేట్ చేస్తున్నారంటే ఏదో సంథింగ్ జ‌రుగుతోంది! అంటూ సందేహం వ్య‌క్తం అవుతోంది. ఇదంతా త్వ‌ర‌లో రిలీజ్ కి వ‌స్తున్న `విజిల్` మూవీ కోసం. ఇది కేవ‌లం ప్ర‌చార జిమ్మిక్ అనుకోవాలా.. ఇదేమైనా వ‌ర్క‌వుట‌వుతుందా? అంటూ సందేహం వ్య‌క్తం చేస్తున్నారు.

సినిమాల్లో కంటెంట్ ఉన్నా కూడా ఎందుక‌నో ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్ మ‌న ఆడియెన్ కి క‌నెక్ట్ కాలేక‌పోయాడు. గ‌తంలో వండ‌ర్ అనిపించే `తుపాకి`(తుపాక్కి-త‌మిళం) వ‌చ్చినా మ‌నోళ్లు ఆద‌రించ‌లేదు. అదిరింది (మెర్స‌ల్) కూడా బావుంది అన్నారు కానీ జ‌నం థియేట‌ర్ల‌కు వెళ్ల‌లేదు. వెళ్లిన‌వాళ్ల‌కు న‌చ్చిందంతే. అందుకే ఇప్పుడు `విజిల్` విష‌యంలో చేస్తున్న ప్ర‌చారం హ‌డావుడి ఎంత‌వ‌ర‌కూ క‌నెక్ట‌వుతుంది? అన్న సందేహం వ్య‌క్త‌మ‌వుతోంది. ఈసారైనా విజ‌య్ కి తెలుగు ఆడియెన్ థియేట‌ర్ల‌లో విజిల్ వేస్తారా? సూర్య‌- కార్తీ- విశాల్ లాంటి హీరోల‌కు ఉన్న మార్కెట్ కూడా విజ‌య్ కి లేదు. కానీ ప్ర‌మోష‌న్ తో అది తేగ‌ల‌రా? అన్న‌ది చూడాలి. ఒక హీరోని నమ్మాలంటే డిస్ట్రిబ్యూట‌ర్లు చాలా డేటా ప‌రిశీలిస్తున్నారు.

అంతెందుకు.. మెగాస్టార్ చిరంజీవి న‌టించిన `సైరా` ప‌రిస్థితే త‌మిళంలో ఏమైంది? తెలుగులో అంత పెద్ద విజ‌యం సాధించిన `సైరా`ను.. ర‌జ‌నీకాంత్ సైతం బావుంది అని పొగిడిన సినిమాను త‌మిళులు ప్రాంతీయ ఫీలింగ్ తోనే ప‌క్క‌న పెట్టేశారు. ఇప్పుడు అదే ప‌రిస్థితి విజ‌య్ కి ఇక్క‌డా ఎదురు కానుందా.. అన్న సందేహం వ్య‌క్తం అవుతోంది. మ‌రి కొన్నిటికి కాల‌మే స‌మాధానం చెప్పాల్సి ఉంది.