Begin typing your search above and press return to search.

50వేల మంది రోడ్డున‌.. సినీ కార్మికుల్ని ఆదుకోవాల‌ని కేసీఆర్ కి లేఖ‌

By:  Tupaki Desk   |   25 Oct 2020 6:15 AM GMT
50వేల మంది రోడ్డున‌.. సినీ కార్మికుల్ని ఆదుకోవాల‌ని కేసీఆర్ కి లేఖ‌
X
తెలంగాణ సీఎం కేసీఆర్ ‌కు నిర్మాత న‌ట్టికుమార్ లేఖ రాశారు. తెలంగాణ‌లో థియేట‌ర్లు తెరిచి థియేట‌ర్ కార్మికుల్ని ఆదుకోవాల‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న డిమాండ్ చేశారు. రాష్ట్రంలో థియేట‌ర్లు తెర‌వ‌క‌పోవ‌డం వ‌ల్ల ప్ర‌త్య‌క్ష్యంగా ప‌రోక్షంగా 50 వేల మంది రోడ్డున ప‌డ్డార‌ని ఈ సంద‌ర్భంగా గుర్తుచేశారు. వెంట‌నే థియేట‌ర్లు తెరిచి కార్మికుల్ని ఆదుకోవాల‌న్నారు. అప్పాయింట్ మెంట్ ఇస్తే సినీ కార్మికులు ప‌డుతున్న బాధ‌ల్ని వివ‌రిస్తాన‌ని న‌ట్టికుమార్ లేఖ‌లో పేర్కొన్నారు.

సినిమా ఇండస్ట్రీ అంటే ఆ న‌లుగురు నిర్మాత‌లే కాద‌న్నారు. లీజు ఓన‌ర్లు.., థియేట‌ర్ల కార్మికులకు 8 నెల‌లుగా జీతాలు ఇవ్వ‌డం లేద‌ని దీనిపై స‌మ‌గ్ర విచార‌ణ చేప‌ట్టివారికి జీతాలు అందేలా చూడాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. థియేట‌ర్ మెయింటైనెన్స్ ఛార్జీల‌ను పెంచాల్సి ఉంద‌ని అ‌న్నారు. లాక్ డౌన్ కార‌ణంగా థియేట‌ర్లు న‌ష్టాల్లో వున్నందుకున వ‌చ్చే మార్చి వ‌ర‌కు థియేట‌ర్ల‌కు జీఎస్టీ లేకుండా చూడాల‌న్నారు.

చిన్న చిత్రాల నిర్మాత‌లు త‌మ సినిమాలు రిలీజ్ చేయ‌డానికి సిద్ధంగా వున్నారు. కాబ‌ట్టి తెలంగాణ‌లో వెంట‌నే థియేట‌ర్లు రీఓపెన్ చేయ‌డానికి అనుమ‌తులు ఇస్తే మంచిద‌ని.. ఇప్ప‌టికే ఏపీ ప్ర‌భుత్వం థియేట‌ర్లు రీఓపెన్ కు ప‌ర్మీష‌న్ లు ఇచ్చేసింద‌ని ఇక్క‌డ కూడా ఇస్తే ఉభ‌య రాష్ట్రాల్లో ఒకేసారి రిలీజ్ చేయ‌డానికి వీలుంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. మ‌రి సీఎం కేసీఆర్ ఈ లేఖ‌ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటారా? లేదా అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.