Begin typing your search above and press return to search.

50 రోజులే! మెగాస్టార్ చిరంజీవి బ‌ర్త్ డే ఈసారి క్రేజీగా!

By:  Tupaki Desk   |   4 July 2022 1:30 AM GMT
50 రోజులే! మెగాస్టార్ చిరంజీవి బ‌ర్త్ డే ఈసారి క్రేజీగా!
X
22 ఆగ‌స్ట్ 1955 .. మెగాస్టార్ చిరంజీవి పుట్టిన తేదీ. ఏజ్ లెస్ హీరోగా ఆయ‌న టాలీవుడ్ లో యువ‌హీరోల‌తో పోటీప‌డుతూ వ‌రుస చిత్రాల్లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. గాడ్ ఫాద‌ర్ చిత్రంతో పాటు మ‌రో రీమేక్ మూవీ భోళాశంక‌ర్ .. వాల్టేర్ వీర‌న్న చిత్రీక‌ర‌ణ‌లు సాగుతున్నాయి. దీంతో పాటే వ‌రుస‌గా అర‌డ‌జ‌ను మంది డైరెక్ట‌ర్లు స్క్రిప్టులు ప‌ట్టుకుని రెడీ గా ఉన్నారు. 66 ఏజ్ లోనూ మెగాస్టార్ ఇంత బిజీగా ఉండ‌డం న‌వ‌త‌రంలో స్ఫూర్తిని నింపుతోంది.

అదంతా అటుంచితే.. మెగాస్టార్ 67వ బ‌ర్త్ డే కి స‌మయం ఆస‌న్న‌మైంది. స‌రిగ్గా ఇంకో 50 రోజుల‌ స‌మ‌యం మిగిలి ఉంది. తాజాగా చిరు అభిమాన సంఘాల సోష‌ల్ మీడియాల్లో ఈ విష‌యం వెల్ల‌డించాయి. మైటీ మెగాస్టార్ చిరంజీవి గారి బ‌ర్త్ డే వేడుక‌లకు స‌మ‌యం ఆస‌న్న‌మైంది. మెగా మాసివ్ సెల‌బ్రేష‌న్స్ పై మెగా అప్ డేట్స్ కోసం వేచి చూడండి అని ట్వీట్ చేసారు. #MegaStarChiranjeevi .. #50DaysToGoForMegaStarBDay హ్యాష్ ట్యాగ్ లు వైర‌ల్ అవుతున్నాయి.

వ‌రుస‌గా రెండు సంవ‌త్స‌రాలు క‌రోనా క్రైసిస్ వ‌ల్ల ఎలాంటి బ‌ర్త్ డే సంబ‌రాలు జ‌ర‌గ‌లేదు. మెగాస్టార్ చిరంజీవి క‌రోనా స‌మ‌యంలో అభిమానుల‌ను సేవా కార్య‌క్ర‌మాలు చేయాల్సిందిగా ఆదేశించ‌గా అంద‌రూ అందులో నిమ‌గ్న‌మ‌య్యారు. ఎంద‌రో అభాగ్యుల ప్రాణాల‌ను కాపాడేందుకు ఆస్ప‌త్రుల‌తో కోఆర్డినేట్ చేస్తూ సైనికులుగా ప‌ని చేసారు. ముఖ్యంగా సెకండ్ వేవ్ స‌మ‌యంలో చిరు-చ‌ర‌ణ్ దాదాపు 30 కోట్లు ఖర్చు చేసి ఆక్సిజ‌న్ త‌యారీ ఎక్విప్ మెంట్ స‌హా భారీగా ప‌రిక‌రాల‌ను కొనుగోలు చేసారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లా కేంద్రాల్లో ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా చేసేందుకు ఏర్పాట్లు చేసారు. క్రైసిస్ లో చిరు ఒక పెద్ద‌న్న‌గా ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిలిచినా మీడియా దానిని హైడ్ చేయ‌డంపై మెగాభిమానులు చాలా గుర్రుమీదున్నారు. ఇక‌పోతే క్రైసిస్ అనంత‌రం తొలి బ‌ర్త్ డే కాబ‌ట్టి ఈసారి వేడుక‌ల‌ను మ‌రో లెవ‌ల్లో ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్నార‌ని తెలుస్తోంది. చిరంజీవి బ‌ర్త్ డే రోజున త‌న సినిమాల ప్ర‌మోష‌న‌ల్ హంగామా ఒక రేంజులో ఉండ‌నుంది ఈసారి.