స్వీటీ శెట్టికి ఎదురైన సమస్యే జాతిరత్నం ఫరియాకు

Tue May 04 2021 06:00:01 GMT+0530 (IST)

5 feet 10 inches tall Faria Abdullah

స్వీటీ శెట్టి అలియాస్ అనుష్క శెట్టి ఐదున్నర అడుగుల ఎత్తుతో చాలా మంది హీరోల్ని టెన్షన్ కి గురి చేసిన సంగతి తెలిసిందే. సూర్య లాంటి స్టార్ హీరోనే సింగం సిరీస్ కోసం చాలా మ్యానేజ్ చేయాల్సొచ్చింది. అనుష్క వెనక వైపుగా లాంగ్ షాట్ లో నిలుచుంటే.. ఫ్రంట్ లైన్ లో సూర్య చేత క్లోజప్ లో స్టెప్పులేయించామని అప్పట్లో సింగం హరి టీమ్ లీకులు ఇచ్చింది.అదంతా సరే కానీ.. ఇప్పుడు అలాంటి సమస్య మరో హీరోయిన్ కి ఎదురవ్వడం ఖాయంగానే కనిపిస్తోంది. ఈ అమ్మడి పేరు ఫరియా అబ్ధుల్లా. ఇటీవలే బ్లాక్ బస్టర్ మూవీ జాతిరత్నాలులో కథానాయికగా నటించింది. ఫరియా తెలుగమ్మాయి. చక్కని తెలుగు మాట్లాడుతుంది. పైగా నటిగానూ మెప్పిస్తోంది. మునుముందు బోలెడంత భవిష్యత్ ఉంది.

అయితే ప్రభాస్ అంతటివాడే ఈ అమ్మడి ఎత్తుకు షాక్ తిన్నారు. 5అడుగుల 10అంగులాల ఎత్తు ఉన్న ఫరియాని చూసి ఇది నిజమైన ఎత్తేనా.. హైహీల్స్ తో మ్యానేజ్ చేశారా? అంటూ సరదా పడ్డాడు డార్లింగ్. ప్రస్తుతం ప్రభాస్ సరసన రాధేశ్యామ్ లో నటించిన పూజా హెగ్డే ఎత్తు 5అడుగుల 5 అంగులాలు..తనకంటే కూడా ఫరియా హైట్ ఎక్కువ. ఫరియా ప్రస్తుతం సెలక్టివ్ గా మాత్రమే కథలు వింటున్నారు. నచ్చితేనే ఓకే చేస్తున్నారట. ఇంకా తన రెండో సినిమాని ప్రకటించాల్సి ఉంది. అలాగే కాలేజ్ స్టడీస్ ని పూర్తి చేయాల్సి ఉందిట. మరోవైపు ఫరియాతో పాటు ఈ సీజన్ లో ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్ లో నటించిన కృతి శెట్టి బ్యాక్ టు బ్యాక్ 4 సినిమాలకు సంతకాలు చేసి కెరీర్ పరంగా బిజీగా ఉంది. ఫరియాకి అంత మంచి భవిష్యత్ ఉందనే ఆశిద్దాం.