బన్నీ - బోయపాటి ఊర మాస్ 'సరైనోడు' చిత్రానికి 5 ఏళ్లు..!

Thu Apr 22 2021 16:00:02 GMT+0530 (IST)

5 Years For Sarrainodu

అల్లు అర్జున్ హీరోగా ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ ''సరైనోడు''. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. బన్నీలోని మాస్ యాంగిల్ ని పూర్తిగా బయటకి తీసిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. అప్పటికి ఆయన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ - కేథరిన్ ట్రెసా హీరోయిన్లుగా నటించగా.. ఆది పినిశెట్టి విలన్ గా నటించాడు. అంజలి ప్రత్యేక గీతంలో నర్తించింది. ఈ సినిమా విజయంలో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అందించిన సంగీతం కీలక పాత్ర పోషించిందని చెప్పవచ్చు.'సరైనోడు' చిత్రానికి రిషి పంజాబీ సినిమాటోగ్రాఫర్ గా.. కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటర్ గా వర్క్ చేశారు. రామ్ - లక్ష్మణ్ యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు. శ్రీకాంత్ - సుమన్ - సాయికుమార్ - బ్రహ్మానందం - జయప్రకాశ్ - ప్రదీప్ రావత్ - సురేఖావాణి - అన్నపూర్ణ - విద్యుల్లేఖ రామన్ - ఎల్బీ శ్రీరామ్ - ఆదర్శ్ బాలకృష్ణ - రాజీవ్ కనకాల ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. ఇందులో బన్నీ నటనకు గాను 'బెస్ట్ యాక్టర్' గా ఫిల్మ్ ఫేర్ క్రిటిక్స్ అవార్డ్-సౌత్ అవార్డ్ అందుకున్నాడు. ఇక యూట్యూబ్ లో ‘సరైనోడు’ హిందీ డబ్ వర్షన్ 300 మిలియన్ పైగా వ్యూస్ అందుకున్న తెలుగు చిత్రంగా రికార్డ్ సృష్టించింది.

2016 ఏప్రిల్ 22న విడుదలైన ‘సరైనోడు’ సినిమా నేటితో 5 వసంతాలను పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో హీరో అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా 'సరైనోడు' చిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలిపాడు. ''5 సంవత్సరాల #సరైనోడు. నా కెరీర్ లో ఒక మైలురాయి లాంటి సినిమా. నా కెరీర్ లో చిరస్మరణీయమైన చిత్రాలలో ఒకటిగా నిలిపినందుకు నా దర్శకుడు బోయపాటి శ్రీను గారికి రకుల్ ప్రీత్ సింగ్ - కేథరీన్ ట్రేసా - ఆది - థమన్ - గీతాఆర్ట్స్ మరియు మొత్తం తారాగణం సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను'' అని బన్నీ ట్వీట్ చేసాడు.

కాగా అల్లు అర్జున్ లోని మాస్ యాంగిల్ ని 'సరైనోడు'లో బోయపాటి చూపించినట్లు ఇప్పటి వరకు మరో డైరెక్టర్ చూపించలేదనే చెప్పాలి. అందుకే 'బన్నీ - బోయపాటి' ఊర మాస్ కాంబినేషన్ లో మరో సినిమా చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి రాబోయే రోజుల్లో వీరి కలయికలో మళ్ళీ సినిమా ఉంటుందేమో చూడాలి.