నాని సినిమాకు బడ్జెట్ సవరణలు!

Thu May 28 2020 14:01:24 GMT+0530 (IST)

40 Cr budget for Nani Shyam Singha Roy

మహమ్మారి కారణంగా కొన్ని సినిమాలలో మార్పుచేర్పులు జరుగుతున్నాయి. ఫారెన్ షెడ్యూల్స్ ప్లాన్ చేసుకున్నవారు దానికి ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు.  బడ్జెట్ల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారని.. బడ్జెట్లను తగ్గించే దిశగా చర్యలు చేపడుతున్నారని టాక్ వినిపిస్తోంది. న్యాచురల్ స్టార్ నాని లైన్లో పెట్టిన ఓ కొత్త సినిమా బడ్జెట్ ను కూడా సవరించే ప్రయత్నాలు జరుగుతున్నాయట.నాని మొదటి నుంచి నిర్మాతల పక్షం వహించే వ్యక్తి అని టాక్ ఉంది. ముందుగా అనుకున్న బడ్జెట్ లోపే సినిమా పూర్తయ్యేలా తనవైపు నుండి పూర్తి సహకారం అందిస్తాడని.. వీలైనంత త్వరగా సినిమాలు కంప్లీట్ చేస్తూ వడ్డీల భారం ఎక్కువ కాకుండా జాగ్రత్త తీసుకుంటాడని అంటారు.  నాని సినిమాల బడ్జెట్ కూడా తన మార్కెట్ స్టామినాకు తగ్గట్టే ఉంటాయి.  అయితే రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'శ్యామ్ సింగరాయ్' సినిమాకు కథ డిమాండ్ మేరకు 40 కోట్ల వరకూ బడ్జెట్ అవుతుందట. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో ఆ బడ్జెట్ ఎక్కువ అవుతుంది కాబట్టి తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారట.

అయితే ఈ సినిమా పట్టాలెక్కేందుకు ఇంకా సమయం ఉంది. ప్రస్తుతం నాని 'టక్ జగదీష్' సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఒక సినిమా.. నూతన దర్శకుడు శ్రీకాంత్ తో మరో సినిమా చేయాల్సి ఉంది.  ఈ సినిమాలు కంప్లీట్ చేసిన తర్వాత 'శ్యామ్ సింగరాయ్' సెట్స్ మీదకు వెళ్తుంది.