ఒకే రోజు 14 సినిమాలు.. ప్రేక్షకులకు పండగ

Fri Sep 23 2022 20:00:01 GMT+0530 (India Standard Time)

4 movies in one day

ఒకప్పుడు శుక్రవారం వస్తుంది అంటే జనాలు థియేటర్ల వద్ద బారులు తిరేందుకు సిద్ధంగా ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఓటీటీ ల్లో కూడా ప్రతి శుక్రవారం ఏవో ఒక సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. కొన్ని సినిమాలు థియేటర్ లో రిలీజ్ అయిన తర్వాత ఓటీటీ లో స్ట్రీమింగ్ అవ్వగా మరి కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.కేవలం సినిమాలు మాత్రమే కాకుండా షో లు మరియు వెబ్ సిరీస్ లు కూడా ఓటీటీ ప్రేక్షకులను ప్రతి వారం ఎంటర్ టైన్ చేస్తూనే ఉన్నాయి. ఇక ఈ శుక్రవారం ఏకంగా 15 సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఓటీటీ లో ఈ సినిమాలతో వారం మొత్తం కూడా ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు పండగ చేసుకోవచ్చు.

ఓటీటీ లో ఈ వారం స్ట్రీమింగ్ అవుతున్న సినిమాల విషయానికి వస్తే... మన తెలుగు సినిమాలు అయిన బబ్లీ బౌన్సర్ (తెలుగు డబ్బింగ్) డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇటీవలే థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా కూడా అప్పుడే ఆహా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇక ఇటీవల మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ధనుష్ నటించిన తిరు సినిమా సన్ నెక్ట్స్ ఓటీటీ ద్వారా వచ్చేసింది. జీ తెలుగు లో కళాపురం అనే సినిమా రాబోతుంది.

ఇక తెలుగు సినిమాలు కాకుండా ఇతర భాషల సినిమాలు కూడా చాలానే ప్రేక్షకుల ముందుకు ఓటీటీ ద్వారా వచ్చేశాయి. వాటి వివరాల్లోకి వెళ్తే.. నెట్ ఫ్లిక్స్ లో హిందీ జంతారా సిరీస్ నేటి నుండి స్ట్రీమింగ్ అవుతుంది. లౌ అనే ఇంగ్లీష్ సినిమా కూడా నెట్ ఫ్లిక్స్ ద్వారా స్ట్రీమింగ్ అవుతుంది. ఎథెనా అనే ఫ్రెంచ్ మూవీ నెట్ ఫ్లిక్స్ ఓటీటీ లో నేటి నుండి స్ట్రీమింగ్ అవుతుంది.

డైరీ అనే తమిళ సినిమా ఆహా ఓటీటీ లో నేటి నుండి స్ట్రీమింగ్ అవుతోంది. షుగర్ లెస్ అనే కన్నడ మూవీ వూట్ ఓటీటీ ద్వారా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చల్లే ముండియాన్ అనే పంజాబి సినిమా సోనీలివ్ ద్వారా స్ట్రీమింగ్ అవుతోంది. హిందీ అతిథి దేవో భవ మరియు సోరియా ద పింద్ అనే పంజాబీ సినిమా జీ 5 లో స్ట్రీమింగ్ అవుతోంది. మొత్తానికి ఈ వారాంతం ఓటీటీ ప్రేక్షకులకు పండగే.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.