మరో 4 రోజుల్లోనే 'ఆర్ఆర్ఆర్' ఎన్టీఆర్ భీం టీజర్

Sun Oct 18 2020 22:30:05 GMT+0530 (IST)

4 days To go RRR NTR Bheem teaser

దర్శక ధీరుడు రాజమౌళి తీస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం‘ఆర్ఆర్ఆర్’. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రాంచరణ్ టీజర్ రిలీజైంది. చరణ్ బర్త్ డే సందర్భంగా ‘భీమ్ ఫర్ రామరాజు’ పేరిట చిత్రబృందం ఓ స్పెషల్ వీడియో విడుదల చేసింది. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో వచ్చిన ఈ వీడియో మెగా ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. జక్కన్న చరణ్ ను పోలీస్ గా చూపించాడు. దీంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నందమూరి ఫ్యాన్స్ తమ ఎన్టీఆర్ టీజర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే కరోనా ఎఫెక్ట్ తో ఈ మూవీ షూటింగు వాయిదా పడగా.. ఇటీవలే రామోజీ ఫిల్మ్ సిటీలో తిరిగి ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన ఓ షార్ట్ వీడియోను రాజమౌళి విడుదల చేసి అభిమానుల్లో జోష్ నింపాడు. దీంతోపాటు ‘ఆర్ఆర్ఆర్’ ఫ్యాన్స్ కోసం ఈనెల 22న ఎన్టీఆర్ టీజర్ రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

ఎన్టీఆర్ టీజర్ ఈనెల 22న ‘రామరాజు ఫర్ భీమ్’ పేరిట రిలీజ్ కానుంది. ఇందులో ఎన్టీఆర్ ను జక్కన్న ఎలా చూపించబోతున్నారనే ఆసక్తి అందరిలో నెలకొంది. చరణ్ ను పోలీసుగా చూపించిన జక్కన్న ఎన్టీఆర్ ను బందిపోటుగా చూపించబోతున్నాడనే ప్రచారం జరుగుతోంది.

ఈ మూవీలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా.. ఎన్టీఆర్ కొమురంభీంగా కన్పించబోతున్నారు. ఈనెల 22న విడుదల కానున్న స్పెషల్ టీజర్లో కొమురంభీం గెటప్ ను కూడా రివీల్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో ‘భీమ్ ఫర్ రామరాజు’ టీజర్ ను మించేలా ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్ ఉంటుందా? అనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ హైప్ ను పెంచుతో ఎన్టీఆర్ కొమురం భీం టీజర్ మరో నాలుగు రోజుల్లో అంటూ బుల్లెట్ పై ఎన్టీఆర్ ప్రయాణించే ఒక స్టిల్ ను తాజాగా విడుదల చేసింది.ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మరో 4 రోజుల్లో టీజర్ అంటూ హైప్ ను పెంచింది.