Begin typing your search above and press return to search.

30Y పృథ్వీ ఆర్టిస్టుల సంఘం అధ్య‌క్షుడు?

By:  Tupaki Desk   |   18 Aug 2019 10:43 AM GMT
30Y పృథ్వీ ఆర్టిస్టుల సంఘం అధ్య‌క్షుడు?
X
ప‌రిశ్ర‌మ‌కు అవిరామంగా 30 ఏళ్లుగా చేస్తున్న‌ సేవ‌ల్ని గుర్తించి అత‌డిని ఆర్టిస్టులు నెత్తిన పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఏకంగా మూవీ ఆర్టిస్టుల సంఘం త‌ర్వాత అంత పెద్ద సంఘంగా పుపుల‌ర‌వుతున్న తెలుగు మూవీ టీవీ ఆర్టిస్టుల సంఘం (టీఎంటీవీ) కి అధ్య‌క్షుడు కాబోతున్నారు. ఇంత‌కీ ఎవ‌రు అత‌డు? అంటే ఇంకెవ‌రు? 30 ఇయ‌ర్స్ పృథ్వీ.

టీఎంటీవీ ఎన్నిక‌లు ఈనెల 25న హైద‌రాబాద్ ఫిలింఛాంబ‌ర్ లో నిర్వహించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ సంద‌ర్భంగా ఇప్ప‌టికే పృథ్వీ రాజ్ అలియాన్ 30 ఇయ‌ర్స్ పృథ్వీ అధ్య‌క్ష ప‌ద‌వికి నామినేష‌న్ వేశారు. తొలుత అత‌డిని ఏక‌గ్రీవంగా అధ్య‌క్షుడిని చేస్తున్నార‌ని ప్ర‌చార‌మైనా.. మ‌ధ్య‌లో ప్ర‌త్య‌ర్థి ప్యానెల బ‌రిలోకి దిగ‌డంతో పోటీ షురూ అయ్యింది. ఇప్ప‌టికే పృథ్వీ ప్యానెల్ నామినేష‌న్లు వేసింది. ఏపీ ఎస్వీబీసీ ఛానెల్ అధ్య‌క్షుడిగా నియ‌మితులైన పృథ్వీకే గెలుపు అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయ‌న్న‌ది ఓ రిపోర్ట్. దాదాపు 730 మంది స‌భ్యులున్న ఈ సంఘంలో మెజారిటీ ఆర్టిస్టులు పృథ్వీకే స‌పోర్ట్ చేస్తున్నార‌ట‌.

పృధ్వీ రాజ్ ప్యానల్ అభ్యర్థుల వివరాలు ప‌రిశీలిస్తే.. ప్రెసిడెంట్ అభ్యర్థి -శ్రీ బాలిరెడ్డి పృథ్వీరాజ్ నామినేష‌న్ వేసారు. వైస్ ప్రెసిడెంట్ అభ్య‌ర్థులుగా ఆశ - శ్రీకాంత్ రెడ్డి కొన‌సాగుతున్నారు. జనరల్ సెక్రెటరీ గా సైదులు.. ఆర్గనైజింగ్ సెక్రటరీ లుగా గోంగూర శ్రీనివాస రావు .. ట్రెజరర్ గా ఉంగరాల వెంకటేశ్వరావు .. జాయింట్ సెక్రెటరీ లుగా పద్మా రెడ్డి - రాజ శేఖర్ పోటీప‌డుతున్నారు. ఈసీ నెంబర్స్ మహిళలుగా లక్ష్మీప్రసన్న- రజిని శ్రీ కళ-తేజస్విని -సౌదామిని - నాగమణి.... పోటీకి దిగుతుండ‌గా.. ఈసీ నెంబర్స్ పురుషులు - జబర్దస్త్ అప్పారావు - జబర్దస్త్ నవీన్ - శ్రీనివాస్ రాథోడ్- నూకరాజు - రవీంద్ర- రామచంద్రయ్య - నాగభూషణం - సుందరయ్య పోటీకి దిగుతున్నారు. వీళ్ల‌పై మా ప్యానల్ అభ్యర్థులుగా నాగేంద్ర శర్మ అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీప‌డుతున్నారు. వైస్ ప్రెసిడెంట్ అభ్య‌ర్థులుగా -ఎం.కామేశ్వర రావు -కే.రుక్మిణీ.. జెనరల్ సెక్రటరీ- సి.శివ కుమారీ(మహాలక్ష్మి).. జాయింట్ సెక్రటరీలుగా జీ. వీరేశ్ -ఎం.విజయ శ్రీ పోటీ చేస్తున్నారు. ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎన్.వి.ఎస్ కామేశ్వర రావు.. ట్రెజ‌ర‌ర్‌గా బీ.హేమంత్ కిషోర్ పోటీకి దిగుతున్నారు. ఈసీ కమిటీ లో ర్యాలీ మోహన్ రావు -ఎన్.నరసింహ రావు-ఏ.శివర్జున్-పి.రమంజి రావు-జయంతి చంద్ర కళా సాహు- జి.ఉమరెడ్డి- బి.కనకదుర్గ పోటీబ‌రిలో ఉన్నారు.