Begin typing your search above and press return to search.

అక్కినేని వారి సినిమాలను గుర్తు చేస్తున్న ప్రదీప్‌ మూవీ

By:  Tupaki Desk   |   22 Jan 2021 6:40 AM GMT
అక్కినేని వారి సినిమాలను గుర్తు చేస్తున్న ప్రదీప్‌ మూవీ
X
తెలుగు బుల్లి సూపర్‌ స్టార్‌ ఇమేజ్ ను దక్కించుకున్న యాంకర్‌ ప్రదీప్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం '30 రోజుల్లో ప్రేమించడం ఎలా'. గత ఏడాది సమ్మర్ ఆరంభంలో విడుదల చేయాలనుకున్న ఈ సినిమాకు కరోనా అడ్డు వచ్చింది. దాంతో సినిమాను ఓటీటీలో విడుదల చేస్తారని అంతా భావించారు. కాని ప్రదీప్ మొదటి సినిమా అవ్వడంతో పాటు అంచనాలు భారీగా ఉన్న కారణంగా సినిమాను థియేటర్‌ రిలీజ్ కోసం వాయిదా వేస్తూ వచ్చారు. ఎట్టకేలకు విడుదల తేదీ ఖరారు అయ్యింది. ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ట్రైలర్‌ తాజాగా విడుదల అయ్యింది.

ట్రైలర్ విడుదల తర్వాత సినిమా కథ ను చూస్తుంటే అక్కినేని హీరోలు నాగేశ్వరరావు మరియు నాగార్జునలు చేసిన మూగ మనుషులు మరియు జానకిరాముడు సినిమా గుర్తుకు వస్తుందని చాలా మంది అంటున్నారు. ముఖ్యంగా నాగార్జున నటించిన జానకి రాముడు సినిమా కథకు ఈ కథకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయా అన్నట్లుగా టాక్‌ వస్తుంది. పూర్వ జన్మల కథతో రామ్‌ చరణ్‌ తో జక్కన్న 'మగధీర' సినిమా తీశాడు. ఆ కథను కూడా కాస్త గుర్తుకు తెస్తుంది. కాన్సెప్ట్‌ అదే అయినా కథ వేరే ఉంటే ఖచ్చితంగా హిట్‌ ఫార్ములా కనుక సక్సెస్‌ అవుతుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారితో పాటు ప్రేక్షకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రదీప్‌ కు ఈ సినిమాతో బుల్లి తెరపై కూడా మంచి చోటు దక్కుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.