2 కోట్ల మంది ఇన్ స్టా ఫాలోవర్స్ తో కాజల్ హవా!

Sun Oct 24 2021 11:01:19 GMT+0530 (IST)

Kajal Instagram Followers

చందమామ కాజల్ అగ్వర్వాల్ గత ఏడాదే  స్నేహితుడు కం ప్రియుడు గౌతమ్ కిచ్లు ని పెళ్లిచేసుకుని సెటిలైన సంగతి తెలిసిందే. అప్పటికే సౌత్ అగ్ర నాయికగా సత్తా చాటిన కాజల్ టాలీవుడ్ లో ప్రత్యేకించి గుర్తింపును దక్కించుకుంది. నటిగా తనకంటూ స్టార్ డమ్ ని అందుకునిసుదీర్ఘ ప్రయాణాన్నే  కొనసాగించింది. టాలీవుడ్ టాప్ 20 హీరోయిన్ల జాబితాలో తన పేరును సుస్థిరం చేసుకుంది కాజల్. అంతగా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో తనదైన ముద్ర వేసింది. 35 ఏజ్ లో కెరీర్ చరమాంకానికి చేరుకుంది కాబట్టే పెళ్లిచేసుకుందని ఓ విమర్శ తెరపై కి వచ్చినా .. అది నిజం కాదని కాజల్ స్పీడ్ మరోసారి నిరూపించింది. ప్రస్తుతం తన లైనప్ లో ఉన్నప్రాజెక్ట్ లు చూస్తే షాక్ అవ్వాల్సిందే.పెళ్లైనా  వరుసగా కొత్త కమిట్మెంట్లకు సంతకాలు చేస్తూనే ఉంది. అయితే పెళ్లి తర్వాత మాత్రం ఎక్కువగా కోలీవుడ్ సినిమాలపైనే ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం అక్కడ అరడజను సినిమాలు చేతిలో ఉన్నాయి. వాటిలో నాలుగు సినిమాలు షూటింగ్ కూడా పూర్తిచేసుకుని రిలీజ్ లకు సిద్ధంగా ఉన్నాయి.  ఇక తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన `ఆచార్య`లో నటిస్తుంది. అలాగే నాగార్జున  `ది  ఘోస్ట్` అనే మరో చిత్రానికి సంతకం చేసినా ఫ్రెగ్నెన్సీ వల్ల తప్పుకుందని ప్రచారమైంది. ఇక పాన్ ఇండియా చిత్రం `ఇండియన్ -2` లో కూడా నటిస్తోంది. ఇలా కాజల్ పెళ్లి తర్వాత బిజీ నటిగానే కొనసాగుతుంది.  తాజాగా అమ్మడు సోషల్ మీడియా ఖాతా ఇన్ స్టాగ్రమ్ లో మరో మైలు రాయిని చేరుకుంది.

ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో కాజల్ ఫాలోవర్స్ 20 మిలియన్ల (2కోట్లు)కు చేరుకున్నారు. పెళ్లయినా కాజల్ ఫాలోయింగ్ ..క్రేజ్ ఎంతమాత్రం తగ్గలేదని  ఈ లెక్క చెప్పకనే చెబుతుంది. ఇప్పటికే ఈ జాబితాలో పెళ్లి కాని కొంత మంది భామలు తమన్నా... అనుష్క..నయనతార లాంటి భామలున్నారు. తాజాగా వాళ్ల సరసన పెళ్లైన భామ చందమామ చేరడం విశేషం. తెలుగులో `లక్ష్మీ కళ్యాణం`  చిత్రంతో కాజల్  ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తొలి సినిమా ఫలితాలు తారుమారైనా ఆ తర్వాత టైమ్  కలిసొచ్చి క్లిక్ అయింది. కెరీర్ ఆరంభమే రామ్ చరణ్ - బన్ని-ప్రభాస్- ఎన్టీఆర్ లాంటి అగ్రహీరోల సరసన నటించి పెద్ద విజయాల్ని అందుకుంది కాజల్.