'అంధాధున్' రీమేక్ లో 2018 మిస్ ఇండియా

Sun Nov 17 2019 09:57:32 GMT+0530 (IST)

2018 Miss India in 'Andhudhan' remake

మానుషీ చిల్లర్ తరువాత మిస్ ఇండియా పోటీల్లో టైటిల్ దక్కించుకుంది అనుకృతి వాస్.  తమిళనాడు లోని తిరుచ్చిరాపల్లికి చెందిన అనుక్రితి 21 ఏళ్ల వయసు లోనే మిస్ ఇండియా కిరీటాన్ని దక్కించుకుని దేశ వ్యాప్తంగా పాపులర్ అయింది. బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి ఆయుష్మాన్ ఖురానా కు జాతీయ అవార్డును తెచ్చిపెట్టిన చిత్రం 'అంధాధున్' చిత్రాన్ని తెలుగు- తమిళ భాషల్లో త్వరలో రీమేక్ చేయబోతున్నారు. తమిళం లో ప్రశాంత్ హీరోగా నటిస్తున్నాడు. ఈ రీమేక్ ద్వారా తమిళ తెరకు అనుక్రితి వాస్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది.
 
ఈ సందర్భంగా మీడియా లో అటెన్షన్ క్రియేట్ చేయడం కోసం సోషల్ మీడియా లో తన ఫొటోల తో కుర్ర కారుని సంపేస్తోంది. తాజాగా రివీలైన అను ఫోటోలు యువతరం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. వైట్ కలర్ ఔట్ ఫిట్ లలో అనుక్రితి వాస్ సొగసు చూడతరమా అంటూ అంతా అవాక్కవుతున్నారు. దీనికి తోడు ఈ అమ్మడు స్టన్నింగ్ స్టేట్‌మెంట్స్ ఇస్తోంది."మీడియాలో టెన్షన్ డ్రా చేయాలంటే పేపర్ పెన్సిల్ పట్టుకుని స్కెచ్ వేయాల్సిన అవసరం నాకు లేదు. ఎట్రాక్ట్ చేసే ఫొటో షూట్ లు కూడా నాకు పెద్దగా నచ్చవు. సహజత్వంతో కూడిన అందమంటేనే ఇష్టపడతాను. అలాగే వుండాలనుకుంటాను`" అంటూ డైరెక్టుగా మీడియానే టీజ్ చేసింది. వైట్ కలర్ క్రాప్ టాప్ లో అందాల విందు చేస్తున్న అనుక్రితి వాస్ అందంగా డిజైనర్ లుక్ లో కనిపించడమే కాదు.. వేడెక్కించే స్టేట్ మెంట్లు ఇవ్వడం ద్వారానూ పాపులారిటీ పెంచుకునే పనిలో ఉంది. ఇకపై సినిమాల్లో తనదైన ముద్ర వేస్తుందా లేదా? అన్నది ప్రేక్షకులే తేల్చాలి.