20 ఏళ్ల గుర్తింపు ఒక్క సినిమాతోనే...!

Wed Sep 28 2022 19:13:28 GMT+0530 (India Standard Time)

20 years of recognition with just one movie

అల్లు అర్జున్ సుకుమార్ ల కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా సెన్షేషన్ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అల్లు అర్జున్ కెరీర్ పుష్ప కి ముందు పుష్ప తర్వాత అన్నట్లుగా మారింది. ప్రస్తుతం ఈయన పై బాలీవుడ్ ఫోకస్ ఉంది.. ముఖ్యంగా బాలీవుడ్ మీడియా పదే పదే అల్లు అర్జున్ తో షో లు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి అనడంలో సందేహం లేదు.తాజాగా ఒక జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పుష్ప సినిమా తో తనకు మంచి గుర్తింపు దక్కింది. ఒక వేళ తనకు పుష్ప సినిమా వచ్చి ఉండకుంటే ఈ స్థాయిలో గుర్తింపు దక్కించుకునేందుకు మరో 20 ఏళ్ల పాటు కష్టపడాల్సి వచ్చేది అంటూ పుష్ప విజయం తనకు ఎంత కీలకమైనదో చెప్పకనే చెప్పాడు.

పుష్ప సినిమా ఈ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకుంటుందని నేను అస్సలు ఊహించలేదు. విజయం అయితే దక్కుతుంది అనుకున్నాను... కానీ ఈ స్థాయిలో పాన్ ఇండియా స్థాయిలో అది కూడా హిందీ వర్షన్ వంద కోట్ల వసూళ్లను సాధిస్తుందని ఏ ఒక్కరం కూడా ఊహించలేదు. పుష్ప ను హిందీ ప్రేక్షకులు ఎంతగా సొంతం చేసుకున్నారో అర్థం చేసుకోవచ్చు అన్నాడు.

అందుకే పుష్ప 2 సినిమా అంచనాలను అందుకునేలా.. పుష్ప 1 తాలూకు హంగామా మిస్ అవ్వకుండా చేయబోతున్నట్లుగా అల్లు అర్జున్ పేర్కొన్నాడు. సుకుమార్ ఇప్పటికే పుష్ప 2 కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ని ముగించాడని.. త్వరలోనే షూటింగ్ ను ప్రారంభించాల్సి ఉందంటూ వార్తలు వస్తున్నాయి. అల్లు అర్జున్ తో పాటు ఈ సినిమా లో హీరోయిన్ గా రష్మిక మందన్నా కంటిన్యూ అవ్వబోతుంది. ఐటం సాంగ్ విషయంలో మార్పు ఉండే అవకాశం ఉందట. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.