కామ్రేడ్ తో రష్మిక రొమాన్స్.. బీజీఎంతోనే మూడ్!

Mon Jul 26 2021 22:00:01 GMT+0530 (IST)

2 Years For Vijay Devarakonda Emotional Love Story

విజయ్ దేవరకొండ- రష్మిక జంటగా భరత్ కమ్మ తెరకెక్కించిన `డియర్ కామ్రేడ్` 2019లో రిలీజైన సంగతి తెలిసినదే. ఈ మూవీ ఎమోషనల్ లవ్ ఎంటర్ టైనర్ గా అలరించినా ఆశించిన విజయం దక్కలేదు. కానీ ఈ సినిమాకి థీమ్ ని ఎలివేట్ చేసే బీజీఎం ట్రీట్ గురించి ప్రతిసారీ యూత్ ముచ్చటిస్తారు.విజయ్ - రష్మిక జంట ఘాడమైన ప్రేమ ప్రణయం అందులోనే బ్రేకప్ ఎమోషన్ వగైరా అన్నిటినీ ఎలివేట్ చేయగా విజువల్లీ ఫెంటాస్టిక్ అనిపిస్తుంది. అందుకు సంబంధించిన మూడ్ లోకి తీసుకెళ్లే బీజీఎం ని జస్టిన్ ప్రభాకరన్ సమకూర్చారు. డియర్ కామ్రేడ్ రిలీజై రెండేళ్లు అయిన సందర్భంగా ఆ బీజీఎం ని రిలీజ్ చేసింది చిత్రబృందం. విజయ్ - రష్మిక జంట  ఫ్యాన్స్ కి ఇది స్పెషల్ ట్రీట్ అని చెప్పాలి.

అసలు ప్రేమ గువ్వలు అంటే విజయ్ -రష్మిక అన్నంతగా లీనమైపోయి ఆ షాట్స్ లో కనిపించారు. లవ్ ఫీల్ ని మూడ్ ని క్యారీ చేసిన రేర్ షాట్స్ ఇవి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా బీజీఎం అంత అందంగా కుదిరింది. నాయకానాయికలు ఎంతో ఇష్టపడి నటించిన పాత్రలు అవి.. కానీ సినిమా ఆశించిన స్థాయికి రీచ్ కాకపోవడమే ఫ్యాన్స్ ని నిరాశపరిచింది.