Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ వేళ..ప్రేమలోకంలో ప్రేక్షకులు

By:  Tupaki Desk   |   3 April 2020 11:30 PM GMT
లాక్ డౌన్ వేళ..ప్రేమలోకంలో ప్రేక్షకులు
X
దేశంలో లాక్ డౌన్ విధించారు. జనాలను ఇంటి గడప దాటకుండా కట్టడి చేశారు. మరి ఇంట్లో ఉన్న జనాలకు బోర్ కొట్టకుండా ఏం చేస్తున్నారు. ఇంకేముంది రోమాంటిక్ సినిమాలు చూస్తూ కాలం గడుపుతున్నారట..

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకాదరణ పొందిన 15 హాలీవుడ్, బాలీవుడ్ ప్రేమ కథా చిత్రాలు చూసేందుకు జనం ఆసక్తి చూపిస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి విజయవంతమైన ప్రేమ కథా చిత్రాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

ఎంటర్ టైన్ మెంట్ కే జనాలు ఎక్కువగా ప్రాధాన్యత నిస్తున్నారు. జియోతో ఇంటర్ నెట్ ఉచితంగా రావడం.. జీబీ కుప్పలుగా రావడంతో హాలీవుడ్, బాలీవుడ్ ప్రేమ కథా చిత్రాలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

అత్యధికంగా చూస్తున్న ప్రేమ కథా చిత్రాల జాబితాలో 1960 నాటి సలీం, అనార్కలీల ప్రేమకథ చిత్రం మొఘల్ ఆజం నుంచి దిల్ వాలే దుల్హానియా లే జాయేంగే (షారుఖ్‌ఖాన్ కాజోల్), జబ్ వి మెట్ (కరీనాకపూర్, షాహిద్ కపూర్), మాసాన్ (విక్కీ కౌశల్, శ్వేతాత్రిపాఠి, రిచాచద్దా) బాలీవుడ్ సినిమాలు ఎక్కువ మంది వీక్షిస్తున్నారు.

లాక్ డౌన్ సమయాన్ని ప్రేమ కథా చిత్రాలు వీక్షించడానికే జనాలు చూస్ చేసుకున్నారని అర్థమవుతోంది. యూట్యూబ్, అమెజాన్ ప్రైం వీడియోలు, నెట్ ఫ్లిక్స్, హులూల ద్వారా ప్రజలు ఇళ్లలోనే ఈ ప్రేమ కథా చిత్రాలను వీక్షిస్తున్నారు.

హాలీవుడ్ సినిమాల విసయానికి వస్తే నైటింగ్ హిల్, ఏ స్టార్ ఈజ్ బోర్న్, కాసాబ్లాంకా తదితర ప్రముఖ హాలీవుడ్ చిత్రాలను ఎక్కువగా డౌన్ లోడ్ చేసుకొని చూస్తున్నారట..