ఫ్లాప్ మూవీకి 100 మిలియన్ వ్యూస్...!

Wed Aug 05 2020 13:20:18 GMT+0530 (IST)

100 million views for a flop movie

దక్షిణాది సినిమాలకి నార్త్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంటదనే విషయం తెలిసిందే. ముఖ్యంగా మన తెలుగు సినిమాలకి అక్కడ విపరీతమైన ఆదరణ దక్కుతోంది. అందుకే తెలుగులో రిలీజ్ అయ్యే ప్రతి సినిమాని హిందీలో డబ్ చేసి యూట్యూబ్ లో పెడుతున్నారు. ఈ క్రమంలో ఇక్కడ ప్లాప్ అయిన సినిమాలకి కూడా మిలియన్ల కొలది వ్యూస్ వస్తున్నాయంటేనే అక్కడ తెలుగు సినిమాలకి ఉండే క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో అక్కినేని అఖిల్ కూడా హిందీ డబ్బింగ్ సినిమాతో యూట్యూబ్ రికార్డ్స్ లోకి అడుగు పెట్టాడు.కాగా అక్కినేని వారసుడు అఖిల్ నటించిన 'మిస్టర్ మజ్ను' సినిమా హిందీ డబ్బింగ్ వర్షన్ యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన 40 గంటలలోపే 20 మిలియన్స్ వ్యూస్ సాధించి ఆల్ టైం రికార్డు సొంతం చేసుకుంది. ఈ క్రమంలో తాజాగా 'మిస్టర్ మజ్ను' హిందీ డబ్బింగ్ వర్షన్ 100 మిలియన్స్ మార్క్ వ్యూస్ దాటింది. ఈ సినిమా యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన నెల రోజుల్లో వంద మిలియన్లకు పైగా వ్యూస్ తెచ్చుకోవడం పాటు 1.3 మిలియన్ లైక్స్ సాధించడం విశేషం.

వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన 'మిస్టర్ మజ్ను' సినిమాని బీ.వీ.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఇస్మార్ట్ బ్యూటీ నిథి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. థమన్ సంగీతం అందించిన ఈ మూవీ తెలుగులో ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే ఈ సినిమా హిందీ వర్షన్ మాత్రం ఉత్తరాదిన విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో అఖిల్ ప్లాప్ మూవీ అక్కడ హిట్ అవడంతో పాటు రికార్డ్స్ కూడా క్రియేట్ చేసిందని చెప్పవచ్చు.

ఇదిలా ఉండగా అక్కినేని నాగచైతన్య నటించిన 'సవ్యసాచి' సినిమా కూడా యూట్యూబ్ లో 100 మిలియన్ కి పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. ఇక హిందీలో డబ్బింగ్ చేసిన రిలీజ్ చేసిన తెలుగు సినిమాలలో రామ్ పోతినేని నటించిన 'నేను శైలజ' 'ఉన్నది ఒకటే జిందగీ' 'ఇస్మార్ట్ శంకర్'.. నితిన్ 'అ ఆ' 'చల్ మోహన్ రంగా' 'శ్రీనివాస కల్యాణం'.. అల్లు అర్జున్ 'సరైనోడు' 'డీజే దువ్వాడ జగన్నాథం'.. బెల్లకొండ శ్రీనివాస్ 'కవచం' 'జయజానకీ నాయక' చిత్రాలు 100 మిలియన్స్ కి పైగా వ్యూస్ సాధించాయి.