Begin typing your search above and press return to search.

#SURIYA 40..అనూహ్యంగా ద‌ర్శ‌కుడు మారాడే!

By:  Tupaki Desk   |   25 Oct 2020 5:32 PM GMT
#SURIYA 40..అనూహ్యంగా ద‌ర్శ‌కుడు మారాడే!
X
స్టార్ హీరో సూర్య న‌టించిన ఆకాశ‌మే నీ హ‌ద్దుగా (సూరారై పొట్రూ) త్వ‌ర‌లో ఓటీటీలో రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. త‌దుప‌రి బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌కు సూర్య సంత‌కాలు చేసి ప‌రుగులు పెట్టిస్తున్నారు. కొన్నిటిని సొంత బ్యాన‌ర్ లో నిర్మిస్తూనే బ‌య‌టి బ్యాన‌ర్ల‌కు అవ‌కాశాలిస్తున్నాడు సూర్య‌. ఏడాది కాలంగా సూర్య‌ను క‌థ‌తో క‌న్విన్స్ చేసేందుకు ట్యాలెంటెడ్ వేట్రిమార‌న్ ... పాండిరాజ్.. హ‌రి వంటి ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు పోటీప‌డుతున్నారు.

ఎట్ట‌కేల‌కు పాండిరాజ్ తో మూవీ క‌న్ఫామ్ అయ్యింది. నిజానికి ఈ మూవీని ఈపాటికే ప్రారంభించాల్సి ఉన్నా క‌రోనా వ‌ల్ల ఆల‌స్య‌మైంది. నేడు విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా అధికారికంగా లాంచ్ చేశారు. ఇది సూర్య న‌టిస్తున్న 40వ సినిమా. వచ్చే ఏడాది అంటే 2021 జనవరిలో షూటింగ్ ప్రారంభించాలని ప్లాన్ చేశారు.

అలాగే వెట్రిమారన్ `వాడివాసల్` లేదా హరితో `అరువ `చిత్రీకరణను ప్రారంభిస్తాడని కూడా తెలిసింది. ప్ర‌స్తుతానికి అరువా పై ఇంకా స్ప‌ష్ఠ‌త రాలేదు. వెట్రిమారన్ తో మూవీ కొంత గ్యాప్ త‌ర్వాత‌ ప్రారంభమవుతుంది. అంత‌కుముందే.. జనవరి 2021 లో పాండిరాజ్ మూవీని మొద‌లెట్టేస్తార‌ట‌.

ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని తాజాగా రిలీజైన పోస్ట‌ర్ చెబుతోంది. సినిమాని అధికారికంగా ప్రారంభించామ‌ని అంద‌రి ఆశీస్సులు కావాల‌ని సూర్య స్వ‌యంగా ట్విట్ట‌ర్ లో కోరారు. ఇంకా టైటిల్ నిర్ణ‌యించ‌ని ఈ క్రేజీ ప్రాజెక్టుకు ప్రతిష్టాత్మక సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. డి ఇమ్మన్ సంగీతాన్ని కంపోజ్ చేయనున్నాడు. ఈ ప్రాజెక్ట్ కి మహిళా ప్రధాన పాత్ర మరియు మిగిలిన స్టార్ తారాగణాన్ని మేకర్స్ ఇంకా ఖరారు చేయలేదు.