Begin typing your search above and press return to search.

RRR సినిమాకు చేగువేరా సినిమా లింక్?

By:  Tupaki Desk   |   18 Oct 2019 1:30 AM GMT
RRR సినిమాకు చేగువేరా సినిమా లింక్?
X
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న 'RRR' షూటింగ్ జోరుగా సాగుతోంది. దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. 'RRR' టీమ్ నుండి సినిమా షూటింగుకు సంబంధించిన అప్డేట్లు ఏవీ రావడం లేదుకానీ వాటితో సంబంధం లేకుండా ఏవో ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మాత్రం ప్రచారంలోకి వస్తున్నాయి

ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలోనూ.. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలోనూ నటిస్తున్నారు. ఈ రెండు పాత్రలూ కలిసి చేసిన ప్రయాణం.. బ్రిటిష్ వారితో పోరాటం చేసే దిశగా పురికొల్పిన సంఘటనలను సినిమాలో చూపించబోతున్నారు. అయితే ఇందులో కల్పితమైన కథ ఉంది. ఈ ఇద్దరి ప్రయాణానికి.. ఆ సంఘటనలకు ఒక సినిమా నుంచి ప్రేరణ తీసుకున్నారట. ఆ సినిమానే చేగువేరా జీవితం ఆధారంగా తెరకకెక్కిన క్లాసిక్ ఫిలిం 'మోటార్ సైకిల్ డైరీస్'. ఈ సినిమాలో చేగువేరా విప్లవ మార్గం ఎంచుకోక మునుపు తన స్నేహితుడితో కలిసి కొన్ని వేల కిలోమీటర్లు బైక్ జర్నీ చేస్తాడు. ఆ ప్రయాణంలో కలిసిన మనుషులు.. జరిగిన సంఘటనలు చేగువేరా జీవితంపై ప్రభావం చూపిస్తాయి. 'RRR' సినిమాలో కొంతభాగం ఈ సినిమా నుండి ఇన్ స్పైర్ అయ్యారని టాక్ వినిపిస్తోంది.

అయితే ఇది ఎంతమాత్రం నిజం అనేది సినిమా రిలీజ్ అయితే కానీ తెలిసే అవకాశం లేదు. ఈ సినిమాను జులై 30 న రిలీజ్ చేస్తామని చాలా రోజుల క్రితమే ప్రకటించారు. ఈమధ్య 'RRR' సినిమా రిలీజ్ వాయిదా పడుతుందని కొన్ని వార్తలు వచ్చాయి కానీ అదేమీ లేదని ముందు చెప్పిన సమయానికే రిలీజ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.