'ఆర్ ఆర్ ఆర్' ఎట్టకేలకు అప్ డేట్

Tue Nov 19 2019 18:56:09 GMT+0530 (IST)

#RRR Movie Latest update

ఎన్టీఆర్ రామ్ చరణ్ కాంబినేషన్ లో రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్ ఆర్ ఆర్' సినిమా నుండి ఎప్పుడెప్పుడు ఓ అప్డేట్ వస్తుందా ? అని వెయిట్ చేసిన సినిమా లవర్స్ కి ఎట్టకేలకు అప్డేట్ ఇచ్చి ఖుషీ చేసారు మేకర్స్.  సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే రోజు సినిమా షూటింగ్ మొదలైందని ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తి చేసామని తెలిపారు. రామ్ చరణ్ సరసన అలియా భట్ నటిస్తున్న ఈ సినిమాలో తారక్ సరసన నటించే హీరోయిన్ పేరు రేపు ప్రకటించనున్నారు. అలాగే సినిమాలో విలన్ ఎవరనేది కూడా తెలియజేస్తామంటూ ఓ అప్డేట్ వదిలారు.  ఇక మేకర్స్ పెట్టిన ఈ పోస్ట్ చూసి అప్పుడే జక్కన్న డెబ్బై శాతం పూర్తి చేసేసాడా అంటూ షాకవుతున్నారు. ఆడియన్స్.

 సినిమాలో ఇప్పటికే అజయ్ దేవగన్ తో పాటు సముద్రఖని కూడా ఓ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక వీరిద్దరితో పాటు సినిమాలో మెయిన్ విలన్ గా నటించేది ఎవరనేది రేపు తెలిసిపోతుంది. అలాగే తారక్ సరసన నటించే చాన్స్ ఎవరికి దక్కిందో కూడా తెలియనుంది.