Begin typing your search above and press return to search.

#RRR ఆసక్తికరమైన అప్‌ డేట్‌

By:  Tupaki Desk   |   13 Nov 2019 6:42 AM GMT
#RRR ఆసక్తికరమైన అప్‌ డేట్‌
X
టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకం గా రూపొందుతున్న 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రం పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకం గా చెప్పనక్కర్లేదు. సినిమాను ఎట్టి పరిస్థితుల్లో చెప్పిన టైం కు అంటే 2020 జులై 30న విడుదల చేయాలని జక్కన్న తీవ్రం గా ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీ లో చిత్రీకరణ జరుపుతున్నారు. ప్రస్తుతం రామ్‌ చరణ్‌ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నట్లు గా యూనిట్‌ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది.

రామ్‌ చరణ్‌ ఈ సినిమా లో అల్లూరి సీతారామరాజు పాత్రను చేస్తున్న విషయం తెల్సిందే. అల్లూరి సీతారామ రాజు ను పోలీసులు అరెస్ట్‌ చేసి కోర్టు లో విచారించే సన్నివేశాల ను ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీ లో వేసిన ప్రత్యేక సెట్టింగ్‌ లో తెరకెక్కిస్తున్నారు. ఈ సీన్స్‌ లో ఎన్టీఆర్‌ పాత్ర కనిపించక పోవచ్చు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం నుండి కేవలం టైటిల్‌ లోగో మాత్రమే అఫిషియల్‌ గా విడుదలైంది. ఎప్పుడెప్పుడు ఫస్ట్‌ లుక్‌ వస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

దసరా లేదా దీపావళికి ఖచ్చితం గా ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ ఫస్ట్‌ లుక్‌ వస్తుందని భావించిన ప్రేక్షకులకు నిరాశే మిగిలింది. ఎట్టకేల కు జక్కన్న ఫస్ట్‌ లుక్‌ ను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చాడట. సినీ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం నూతన సంవత్సరం సందర్బం గా ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ ఫస్ట్‌ లుక్‌ ను విడుదల చేయబోతున్నారట. ఎన్టీఆర్‌ మరియు చరణ్‌ కలిసి ఉన్న ఒక పోస్టర్‌ ను మరియు ఇద్దరు వేరు వేరు గా ఉన్న రెండు పోస్టర్‌ లను ఇప్పటి నుండే డిజైన్‌ చేయించే పని లో పబ్లిసిటీ టీం ఉన్నట్లు గా తెలుస్తోంది.

జక్కన్న సినిమా ప్రమోషన్స్‌ విషయం లో చాలా జాగ్రత్త గా ఉండటం తో పాటు క్రియేటివ్‌ గా ఆలోచిస్తాడు. ఈ సినిమా పబ్లిసిటీ కూడా చాలా విభిన్నంగా ఉండేలా ప్లాన్‌ చేస్తున్నాడట. బాలీవుడ్‌ స్టార్స్‌ అజయ్‌ దేవగన్‌ మరియు ఆలియా భట్‌ లతో పాటు పలువురు స్టార్స్‌ ఈ చిత్రం లో నటిస్తున్న కారణం గా దేశ వ్యాప్తం గా ఈ చిత్రం పై ఆసక్తి నెలకొంది. బాహుబలి స్థాయి విజయాన్ని ఈ సినిమా దక్కించుకుంటుందా అంటూ అంతా ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.