Begin typing your search above and press return to search.

క‌రోనా ఛాలెంజ్ వ‌దిలేసి నేక్డ్ ఛాలెంజా?

By:  Tupaki Desk   |   5 April 2020 4:55 AM GMT
క‌రోనా ఛాలెంజ్ వ‌దిలేసి నేక్డ్ ఛాలెంజా?
X
మ‌నిషి మ‌నిషికో పిచ్చి. పిచ్చి పీక్స్ కి చేరుకుంటున్న ట్రెండీ సీజ‌న్ ఇది. ఇండియా- అమెరికా స‌హా 222 దేశాల్లో లాక్ డౌన్ స‌న్నివేశం పిచ్చెక్కిస్తోంది. ఆ క్ర‌మంలోనే ఆన్ లైన్ లో ర‌క‌ర‌కాల పిచ్చి ఆట‌లు వైర‌ల్ అవుతున్నాయి. ఇక ఇందులో ర‌క‌ర‌కాల ఛాలెంజ్ లు సీక్వెన్సుల్లా ఒక‌దాని వెంట ఒక‌టిగా పుట్టుకొస్తున్నాయి. ఐస్ బ‌కెట్ ఛాలెంజ్.. హైడ్ అండ్ సీక్ ఛాలెంజ్.. డ్రెస్ ఛాలెంజ్.. టీషర్ట్ చేంజ్ ఛాలెంజ్.. ఒక‌టేమిటి ఇలాంటి ట్రెండ్స్ ఎన్నో పుట్టుకొచ్చాయి. హ్యాష్ ట్యాగ్ తో వైర‌ల్ అయ్యాయి. తాజాగా #నేక్డ్ ఛాలెంజ్ అనేది అంతే ఇదిగా వైర‌ల్ అవుతోంది.

ఇది ఇండియాలో ఇప్ప‌టివ‌ర‌కూ లేదు కానీ అటు అమెరికా స‌హా పాశ్చాత్య దేశాల్లో ఆట‌విడుపుగా మారింది. దీనిని యువ‌త‌రం విశేషంగానే ఫాలో చేస్తుండ‌డం వేడెక్కిస్తోంది. ఓవైపు క‌రోనా క‌ల్లోలంతో ప్ర‌పంచం అత‌లాకుత‌లం అవుతుంటే ఇలాంటి వేలం వెర్రి వేషాల‌కు కొద‌వేమీ లేదు. మ‌గువ‌లు ఒంటిపై ఉన్న‌వ‌న్నీ ఒలిచేసి బేబీ.. చూస్కో! అంటూ చివ‌రి వ‌స్త్రాన్ని(ట‌వ‌ల్) సైతం ఒంటిపై నుంచి తొల‌గించేస్తుంటే .. మైగాడ్! అంటూ కుర్రాళ్లు క‌ళ్లు తిప్పుకోలేక‌ తెగ ఇదైపోతున్నారు. తాజాగా ఈ త‌ర‌హా వీడియోలు హ్యాష్ ట్యాగ్ తో బోలెడ‌న్ని నెట్ లో వైర‌ల్ అయిపోతున్నాయి.

ప్ర‌స్తుతం టాప్ ట్రెండింగ్ ఛాలెంజ్ ఏది అంటే? # నేకెడ్ ఛాలెంజ్. ఈ వీడియోలు .. పోకడలు చాలావరకు యువ‌త‌రానికి వేలం వెర్రిగా మ‌రాయ‌నే చెప్పాలి. అస‌లే క‌రోనా ఛాలెంజ్ ని ఎదుర్కోలేక ప్ర‌భుత్వాలు త‌ల‌లు పట్టుకుంటుంటే యూత్ కి మాత్రం ఈ ఖాళీ నిర్భంధ‌న స‌మ‌యం ఇలా టైమ్ పాస్ గా మారింది. లాక్ చేసిన ఇంట్లో ఇలా న‌గ్నంగా క‌నిపించ‌డం అనే ఛాలెంజ్ ని మ‌న దేశంలోనూ యూత్ స్వీక‌రించ‌నుందా? అంటే ఏమో.. వింత పోక‌డ‌ల ముంబై ప్ర‌పంచం తొలిగా దీనిపై ఫోకస్ చేస్తుందేమో!

మ‌రోవైపు క‌రోనా దెబ్బ‌కు ల‌క్ష‌లాది మంది పిట్ట‌ల్లా రాలిపోవ‌డానికి సిద్ధంగా ఉన్నా అమెరికాలో ఈ త‌ర‌హా అప‌హాస్య‌పు ధోర‌ణి అంత‌కంత‌కు పెట్రేగుతూనే ఉంది. అగ్ర రాజ్యంలో కేర్ లెస్ యాటిట్యూడ్ బ‌య‌ట‌ప‌డుతూనే ఉంది. అది క‌రోనా అయినా.. లేక పిచ్చి పోక‌డ‌ల్లో అయినా అన్ని ర‌కాల గుట్టును క‌రోనా బ‌య‌ట పెట్టేస్తోంది. ఇదేనా అమెరికా యువభార‌తం? అనేంత‌గా గుట్టు లీక్ చేస్తోంది. అక్క‌డ‌ హ్యాష్‌ ట్యాగ్ పోకడలు ఛాలెంజ్ లు ప్ర‌మాద‌క‌రంగా మారాయ‌ని సంకేతాలు అందుతున్నాయి. అక్క‌డ ఇటీవ‌ల పాపుల‌రైన హ్యాష్ ట్యాగ్స్ ని చూస్తే.. # పాండెమిక్ సెక్స్ టేప్ టైటిల్- # టెర్రిబుల్ క్వారంటిన్అడ్వైస్- # అఫ్రికాన్స్అరేనోట్‌లాబ్‌రాట్స్ ఈ త‌ర‌హాలో ఛాలెంజ్ లు వైర‌ల్ అవుతున్నాయి.