బికినీలో హాట్ బ్యూటీ బాండ్ ఫోజ్

Wed Apr 24 2019 17:26:57 GMT+0530 (IST)

?Lisa Haydon shows off her bikini body while holidaying with family

ఇండియన్ సినీ ప్రేక్షకులకు లీసా హెడెన్ గురించిన పరిచయం అక్కర్లేదు. ముఖ్యంగా బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలు అయిన లీసా హెడెన్ చేసినవి కొన్ని సినిమాలే అయినా కూడా ఆమె చేసిన అందాల ఆరబోతతో అందరి దృష్టిని అమ్మడు ఆకర్షించింది. 2016లో వివాహం చేసుకున్న లీసా హెడెన్ కు ప్రస్తుతం ఒక బాబు కూడా ఉన్నాడు. లీసాకు సముద్రం ఒడ్డున గడపడం చాలా ఇష్టం. సమయం చిక్కినప్పుడల్లా ఈమె సముద్రపు ఒడ్డుకు చేరుకుంటుంది. నిండు గర్బినిగా ఉన్న సమయంలో కూడా లీసా బీచ్ లో గడిపిన విషయం తెల్సిందే. అప్పట్లో ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి.తాజాగా భర్త డినో లల్వానీ మరియు తనయుడు జాక్ లల్వానీతో కలిసి థాయ్ లాండ్ లోని ఒక బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందులో ఒక ఫొటోకు ఎప్పటికైనా జేమ్స్ బాండ్ లా కనిపించాలని కోరుకుంటున్నట్లుగా కామెంట్ పెట్టింది. అందుకు చాలా మంది కూడా నువ్వు ఇప్పుడే చూడ్డానికి బాండ్ లా ఉన్నావు అంటూ ఆమె ఫొటోకు కామెంట్ చేశారు.

సోషల్ మీడియాలో లీసా హెడెన్ కు మిలియన్ ల కొద్ది ఫాలోవర్స్ ఉన్నారు. తన ప్రతి ఒక్క మూమెంట్ ను అభిమానులతో షేర్ చేసుకునేందుకు ఆసక్తి చూపించే లీసా హెడెన్ తాజాగా థాయిలాండ్ లోని బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను వరుసగా పోస్ట్ చేస్తుంది. భర్త బ్రిటన్ లో ప్రముఖ వ్యాపార వేత్త అవ్వడం వల్ల దేశ విదేశాల్లో లీసా మరియు ఫ్యామిలీ ఎంజాయ్ గా చక్కర్లు కొడుతూ వస్తున్నారు. చెన్నైకి చెందిన లీసా హెడెన్ బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించినా కూడా సక్సెస్ లు పెద్దగా దక్కక పోవడంతో పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యి పోయింది. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా జీవితాన్ని చాలా సరదాగా గడుపుతూ వస్తోంది.