Begin typing your search above and press return to search.

#DHOOM4: ప్ర‌భాస్ డీల్ నిజ‌మా?

By:  Tupaki Desk   |   9 Dec 2019 8:47 AM GMT
#DHOOM4: ప్ర‌భాస్ డీల్ నిజ‌మా?
X
బాహుబ‌లి ఫ్రాంఛైజీ స‌హా సాహో చిత్రంతో డార్లింగ్ ప్ర‌భాస్ క్రేజు బాలీవుడ్ లో అసాధార‌ణంగా పెరిగిందే కానీ త‌గ్గ‌లేదు. హిందీ క్రిటిక్స్ నుంచి ఎన్నో విమ‌ర్శ‌లు ఎదురైనా సాహో ఉత్త‌రాదిన చ‌క్క‌ని విజ‌యం సాధించింది. ప్ర‌భాస్ కి ఉన్న‌ ఆ క్రేజును దృష్టిలో పెట్టుకుని య‌శ్ రాజ్ ఫిలింస్ ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా `ధూమ్ 4` కోసం లాక్ చేసింద‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. ప్ర‌భాస్ చేరిక‌తో అటు ఉత్త‌రాది.. ఇటు ద‌క్షిణాది రెండు చోట్లా ధూమ్ 4 మైలేజ్ పెరుగుతుంద‌ని భావిస్తున్నార‌ని అందుకే ఈ ఆఫ‌ర్ ప్ర‌భాస్ ని వ‌రించింద‌ని ప్ర‌చారం హోరెత్తుతోంది.

వాస్త‌వానికి ఈ క్యాలిక్యులేష‌న్ స‌రైన‌దే అయినా య‌శ్ రాజ్ ఫిలింస్ అధినేత నుంచి కానీ.. ప్ర‌భాస్ నుంచి కానీ అధికారికంగా ఎలాంటి క‌న్ఫ‌ర్మేష‌న్ లేక‌పోవ‌డంతో అవ‌న్నీ గాలి వార్త‌లేన‌ని భావించారు. అయితే ఇటీవ‌ల ప్ర‌భాస్ స‌డెన్ గా ముంబై వెళ్ల‌డం స్పెక్యులేష‌న్ కి తావిచ్చింది. అయినా.. డార్లింగ్ ప్ర‌భాస్ కి నిజంగా అలాంటి ఓ అవ‌కాశం వ‌స్తే వ‌దిలిపెడ‌తాడా? హృతిక్... అమీర్ ఖాన్.. షారూక్ లాంటి స్టార్ల‌ను కాద‌ని ప్ర‌భాస్ ని కోరుకుంటే వ‌ద్ద‌నుకుంటాడా? అంటూ ఫ్యాన్స్ లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

అయితే మ‌రోసారి ధూమ్-4లో ప్ర‌భాస్ న‌టిస్తున్నారంటూ ప్ర‌చార‌మ‌వుతోంది. ఇప్ప‌టికే ప్ర‌భాస్ ని య‌శ్ రాజ్ సంస్థ లాక్ చేసినా ఆ విష‌యం చెప్ప‌డం లేదు అంటూ ప్ర‌చారం ఊద‌ర‌గొట్టేస్తుండ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. అయితే జాన్ చిత్రీక‌ర‌ణ పూర్త‌యితే కానీ ప్ర‌భాస్ స్వ‌యంగా త‌దుప‌రి ప్రాజెక్ట్ గురించి మాట్లాడే అవ‌కాశం లేదు. సాహో రిజ‌ల్ట్ కొంత నిరాశ‌ప‌ర‌చ‌డంతో ప్ర‌స్తుతం ఈ ప్రాజెక్ట్ పైనే అత‌డు పూర్తిగా దృష్టి సారిస్తున్నాడు.