Begin typing your search above and press return to search.

అఫిషియల్‌ :#AA20 రెడీ కాండబ్బా!

By:  Tupaki Desk   |   6 April 2020 3:30 PM GMT
అఫిషియల్‌ :#AA20 రెడీ కాండబ్బా!
X
గత రెండు మూడు రోజులుగా అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ బన్నీ 20వ చిత్రానికి సంబంధించిన అప్‌ డేట్‌ ఇవ్వాల్సిందిగా సోషల్‌ మీడియాలో యూనిట్‌ సభ్యులను రిక్వెస్ట్‌ చేస్తూనే ఉన్నారు. అల్లు అర్జున్‌ బర్త్‌ డే సందర్బంగా ఈనెల 8న ఈ చిత్రం అప్‌ డేట్‌ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్‌ వారు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

సినిమా అప్‌ డేట్‌ రాబోతుంది అంటూ కాస్త విభిన్నంగా రాయలసీమ యాసతో పోస్ట్‌ చేయడంతో అంతా కూడా ఈ విషయమై చర్చించుకుంటున్నారు. ఇంతకు ఏం అప్‌ డేట్‌ ఇవ్వబోతున్నారు అనేది కూడా ఆసక్తికర విషయం. ఏమబ్బా, అందరూ బాగుండారా.. మీరు ఎప్పుడెప్పుడా అని చూస్తాండే #AA20 అప్‌ డేట్‌ ఏప్రిల్‌ 8న.. తెల్లార్తో 9 గంటలకు వస్తాండాది.. రెడీ కాండబ్బా అంటూ పోస్ట్‌ చేశారు.

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్‌ వారు భారీ బడ్జెట్‌ తో నిర్మించేందుకు సిద్దం అయ్యారు. ఇక ఈ చిత్రం షూటింగ్‌ కేరళలో జరగాల్సి ఉండగా కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా వాయిదా వేసిన విషయం తెల్సిందే.

#AA20 అప్‌ డేట్‌ అంటూ సినిమా టైటిల్‌ ను ప్రకటించే అవకాశం ఉందని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఇప్పటికే రెండు అక్షరాల టైటిల్‌ ను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. అప్‌ డేట్‌ కోసం అంతా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.