అలిపిరికి అల్లంత దూరంలో

Sat Nov 19 2022 GMT+0530 (India Standard Time)

అలిపిరికి అల్లంత దూరంలో

మూవీ రివ్యూ : అలిపిరికి అల్లంత దూరంలో

నటీనటులు రావణ్ రెడ్డి నిట్టూరు నిఖిత లహరి గుడివాడ అలంకృతాషా ఆముదాల మురళి అమృత వర్షిణి సోమిశెట్టి వేణు గోపాల్ రవీంద్ర బొమ్మకంటి ప్రసాద్ బెహ్రా తదితరులు నటించారు.
సంగీతం : ఫణి కల్యాణ్
ఛాయాగ్రహణం : డిజికె
ఎడిటింగ్ : సత్య గడుటూరి
నిర్మాతలు : రమేష్ డబ్బుగొట్టు
రచన దర్శకత్వం : ఆనంద్ .జె

టాలీవుడ్ లో మునుపెన్నడూ లేని విధంగా కొత్త వాళ్లకు స్వర్ణయగం మొదలైనట్టుగా వుంది. గతంలో సినిమా చేయాలని విశ్వప్రయత్నాలు చేసిన వాళ్లంతా ఇప్పుడు కొత్త కొత్త కథలతో ధైర్యాంగా సినిమాలు చేస్తున్నారు. మారిన ఇండస్ట్రీ పరిస్థితులు కూడా కొత్త వాళ్లకు అనుకూల వాతావరణాన్ని క్రియేట్ చేశాయి. దీంతో కొత్త వాళ్లు ధైర్యాంగా తాము అనుకున్న పాయింట్ తో సినిమాలు చేయడం మొదలు పెట్టారు. ఈ నేపత్యంలోనే రాబరీ క్రైమ్ డ్రామాకు డివోషనల్ టచ్ ఇస్తూ కొత్త కథతో చేసిన మూవీ `అలిపిరికి అల్లంత దూరంలో`. కొత్త హీరో హీరోయిన్ దర్శకుడు పరిచయం అయిన ఈ మూవీ ఎలా వుందో ఒక లుక్కేద్దాం.

కథ:

తిరుపతికి చెందిన వారధి (రావణ్ రెడ్డి నిట్టూరు) ఓ మధ్య తరగతి యువకుడు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారధి వాటి నుంచి బయటపడటం కోసం చిన్న చిన్న మోసాలు చేస్తూ వెంకటేశ్వరస్వామి పటాలు అమ్మే షాప్ ని రెంట్ కు తీసుకుని నడుపుతుంటాడు. అయితే అక్కడే వెంకటేశ్వర గోశాలలో వాలంటీర్ గా పనిచేసే డబ్బున్న ఓ వ్యక్తి కూతురైన కీర్తి (శ్రీనిఖిత) ని ప్రేమిస్తుంటాడు. తను కూడా వారధిని ప్రేమిస్తుంటుంది. ఇది తెలిసిన కీర్తి తండ్రి వారధిని హెచ్చరిస్తాడు. చదువు లేదు కనీసం ఆస్తి కూడా లేదని కనీసం ఆస్తి వున్నా తన కూతురిని ఇచ్చేవాడినని.. ఇంకెప్పుడూ తన కూతురు జోలికి రావద్దని హెచ్చరిస్తాడు. దీంతో వారధి .. కీర్తి తండ్రిని ఒప్పించడం కోసం డబ్బు సంపాదించాలనుకుంటాడు. ఇందు కోసం దొంగతనాలు చేయాలనుకుంటాడు. ఈలోగా స్వామివారికి 2 కోట్లు సమర్పించడానికి ఓ వ్యాపారి కుటుంబం తో సహా వచ్చాడని తెలుసుకుంటాడు. ఎలాగైనా వారిని మోసం చేసి ఆ రెండు కోట్లూ కొట్టేసి కీర్తిని పెళ్లాడాలనుకుంటాడు. ఆ ఆలోచనే వారధిని చిక్కుల్లో పడేస్తుంది. ఆ సమస్యల నుంచి వారధి ఎలా బయటపట్టాడు.. ఈ క్రమంలో వారధికి స్వామి వారు ఎలాంటి పరీక్షలు పెట్టాడు? .. చివరికి వారధి తను కోరుకున్నట్టుగానే తిరుమలలో షాప్ ను సొంతం చేసుకున్నాడా? .. అను ఇష్టపడిన కీర్తిని పెళ్లి చేసుకున్నాడా? అన్నదే అసలు కథ.

కథ కథనం..

ఒక రాబరీ డ్రామాకు డివైన్ ఎలిమెంట్ ని శ్రీవెంకటేశ్వర స్వామి మహత్యాన్ని జోడించి చెప్పడం అనే ఆలోచన బాగుంది. ఒకరిని మోసం చేస్తే వారిని కాలమే సమాధానం చెబుతుంది అనే విషయాన్ని తెలియజేస్తూ ఈ మూవీని తెరకెక్కించాడు దర్శకుడు ఆనంద్. రాబరీ డ్రామాకు ఎమోషనల్ ఎలిమెంట్స్ ని జోడించి తెరకెక్కించిన తీరు బాగున్నా దాని అనుకున్న విధంగా ఎగ్జిర్యూట్ చేయడంలో మాత్రం దర్శకుడు విఫలమయ్యాడని చెప్పొచ్చు. కథలో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కొంత వరకు భావోద్వేగ సన్నివేశాలు క్లైమాక్స్ ఆకట్టుకునే విధంగా వున్నప్పటికీ కథనాన్ని అదే పేస్ తో కంటిన్యూ చేయకుండా సాగదీయడం మైనస్ గా మారింది. కాన్సెప్ట్ బాగున్నా దాన్ని ఎఫెక్టీవ్ గా తెరపై ఆవిష్కరించడంతో దర్శకుడు ఆనంద్ తడబడ్డాడు. అయితే నటీనటుల నుంచి నటనను రాబట్టు కోవడంలో మాత్రం సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు.

ఇక కొన్ని సన్నివేశాలు.. కథనానికి తగ్గ టెంపోని మెయింటైన్ చేయక పోవడం ప్రధాన కథనానికి ప్రేక్షకులని కనెక్ట్ చేయడంలో విఫలం అయ్యాడనిపిస్తోంది. స్క్రీన్ ప్లే విషయంలోనూ దర్శకుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకుని వుంటే ఫలితం మరోలా వుండేదేమో. సినిమాని ఆసక్తికరంగా ప్రారంభించినా కానీ ఆ తరువాత దాన్ని కంటిన్యూ చేయలేకపోవడం మరో మైనస్ గా చెప్పొచ్చు. ఇలాంటి కథకు కావాల్సింది టెంపో .. అది మిస్సయిందా ప్రేక్షకుడు కథనానికి కనెక్ట్ కావడం కష్టం. ఈ సినిమా విషయంలోనూ అదే జరిగింది. కొన్ని అనవసర సీన్ లని తగ్గిస్తే మరింత బాగుండేది.

నటీనటుల నటన:

తొలి సినిమానే అయినా వారధి పాత్రలో రావణ్ నిట్టూరు ఆకట్టుకున్నాడు. తనదైన స్టైల్లో వారధి పాత్రని రక్తికట్టించాడు. ప్రతీ సన్నివేశంలోనూ చాలా ఈజ్ తో నటించాడు. సినిమాకు ప్రధాన బలంగా నిలిచాడు. ఇక హీరోయిన్ కీర్తి పాత్రలో నటించిన శ్రీనిఖిత తన పాత్ర పరిధి మేరకు నటించి ఆకట్టుకుంది. హోటల్ బిజినెస్ మెన్ గా బోమ్మకంటి రవీందర్ మొక్కు తీర్చుకునే పాత్రలో అమృత వర్షిణి సోమిశెట్టి హీరోయిన్ పేరెంట్స్ గా జయచంద్ర తులసి వారధి తల్లి పాత్రలో లహరి గుడివాడ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించి ఆకట్టుకున్నారు. దర్శకుడు వీరి నుంచి తనకు కావాల్సిన రీతిలో నటనని రాబట్టుకోవడంలో సఫలం అయ్యాడు.

కథ కథనాన్ని ఆసక్తిగా నడిపించడంతో బొల్తాకొట్టిన దర్శకుడు ఇక సాంకేతిక వర్గాన్ని కూడా ఆశించిన స్థాయిలో వాడుకోలేకపోయాడు. రాబరీ కాన్సెప్ట్ కు డివోషనల్ అంశాన్ని జోడించి ఆసక్తిగా కథను చెప్పాలనుకున్నా సాంకేతికంగా సినిమాని మరింత బాగా తీసి వుంటే బాగుండేది. సాంకేతిక నిపుణుల్లో ఫణి కల్యాణ్ పనితనం నేపథ్య సంగీతం కొన్ని పాటలు బాగుతున్నాయి. సంగీతం విషయంలో తీసుకున్న జాగ్రత్త సినిమాటోగ్రఫీ విషయంలో కూడా తీసుకుని వుంటే బాగుండేది. షార్ట్ ఫిలిం క్వాలిటీ కూడా లేకపోవడం గమనార్హం. కెమెరా వర్క్ సినిమా రేంజ్ క్వాలిటీ కనిపించలేదు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా ఎలా వున్నాయో కెమెరా వర్క్ ని బట్టి అర్థం చేసుకోవచ్చు.

రాబరీ డివోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో కొన్ని ఎమోషనల్ సీన్స్ హీరో నటన ఫణికల్యాణ్ సంగీతం క్లైమాక్స్ తప్ప చెప్పుకోవడానికి ఏమీ లేవు. సాగదీసే సన్నివేశాలు..ఆసక్తికర సన్నివేశాలు లుకపోవడం.. స్లోగా సాగే కథ కథనాలు.. మంచి పాయింట్ ని తీసుకున్న దర్శకుడు దానికి తగ్గ ఆసక్తికర సన్నివేశాలని రాసుకోవడంతో విఫలమయ్యాడు. క్వాలిటీ విషయంలోనూ రాజీపడి చేసిన ఈ మూవీని వెంకటేశ్వర స్వామి మహత్యాన్ని మరింతగా చూపిస్తూ ఆసక్తికర సన్నివేశాలతో నడిపిస్తే ఫలితం మరోలా వుండేది. కొన్ని ఎమోషనల్ సీన్స్ కాన్సెప్ట్.. క్లైమాక్స్ మినహా ఆకట్టుకునే సీన్స్ లేని ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయిందని చెప్పక తప్పదు.  

రేటింగ్ : 1.75/5

LATEST NEWS