వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?
వయసు పైబడ్డా చర్మంలో వన్నె తరగకుండా ఉండటానికి పాటించాల్సిన ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
By: Madhu Reddy | 27 Oct 2026 4:52 PM ISTవయసు పెరుగుతున్న కొద్దీ ముఖంలో గ్లో తగ్గిపోవడం, ముడతలు రావడం సహజం. అయితే కొన్ని చిన్నపాటి జీవనశైలి మార్పులు పాటిస్తే ఎప్పటికీ యవ్వనంగా, మెరిసే చర్మంతో కనిపిస్తారంటున్నారు నిపుణులు. కేవలం ఖరీదైన క్రీమ్స్ వాడటమే కాకుండా, రోజువారీ అలవాట్లలో మార్పు చేసుకోవడం ద్వారా ముసలితనాన్ని ఇట్టే దరిచేరకుండా చూసుకోవచ్చు. వయసు పైబడ్డా చర్మంలో వన్నె తరగకుండా ఉండటానికి పాటించాల్సిన ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
బ్యాలెన్స్ డైట్‌తోనే అసలైన అందం:
మనం తినే ఆహారం మన చర్మంపై ప్రభావం చూపుతుంది. విటమిన్లు ఏ, సీ, డీ, ఈతో పాటు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ముఖ్యం. తాజా పండ్లు, కూరగాయలు తినడం వల్ల చర్మానికి అవసరమైన పోషకాలు అందుతాయి. అంతేకాకుండా చర్మం, మెదడు, గుండె ఆరోగ్యానికి కూడా ఇవి ఉపయోగపడతాయి.
రోజూ వ్యాయామం.. నిద్ర చాలా ముఖ్యం:
శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా జరిగితేనే చర్మం కాంతివంతంగా మారుతుంది. రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల చెమట రూపంలో మలినాలు బయటకు పోయి చర్మం తాజాగా ఉంటుంది. అలాగే ప్రతిరోజూ రాత్రి తగినంత ప్రశాంతమైన నిద్రపోవడం వల్ల చర్మ కణాలు రిపేర్ అవుతాయి. ఇక సరిగ్గా నిద్రపోకపోతే కళ్ల కింద నల్లటి వలయాలు, ముడతలు వచ్చే అవకాశం ఉంది.
ఎండ నుంచి రక్షణ ఎంతో అవసరం:
సూర్యరశ్మి నుంచి వెలువడే ప్రమాదకరమైన యూవీ కిరణాలు చర్మ ఆరోగ్యాన్ని పాడుచేసి, త్వరగా వృద్ధాప్య లక్షణాలు ముఖంపై కనిపించేలా చేస్తాయి. ఈ కారణంగానే, ఎండలోకి అడుగుపెట్టే ముందు తగిన రక్షణ చర్యలు తీసుకోవడం ఎంతో అవసరం. ఇక నాణ్యమైన సన్‌స్క్రీన్ లోషన్ అప్లై చేసుకోవడం లేదా ముఖానికి స్కార్ఫ్, మాస్క్ ధరించడం వంటి పద్ధతుల ద్వారా సూర్యుని ప్రతాపం నుంచి చర్మాన్ని సురక్షితంగా ఉంచుకోవచ్చు. దీనివల్ల చర్మం కందిపోవడం, ముఖంపై ముడతలు పడే సమస్యల నుంచి రక్షణ పొందవచ్చు.
చెడు అలవాట్లకు పూర్తిగా గుడ్‌బై:
మద్యం సేవించడం, సిగరెట్లు తాగడం వంటి చెడు అలవాట్లు చర్మ సౌందర్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. ఇవి చర్మంలోని కొల్లాజెన్ స్థాయిలను క్షీణింపజేసి, కాంతిహీనంగా మార్చడమే కాకుండా చిన్న వయసులోనే ముఖంపై ముడతలు, వృద్ధాప్య లక్షణాలు రావడానికి కారణమవుతాయి. కాబట్టి ఎల్లప్పుడూ సజీవంగా, కాంతులీనే చర్మంతో కనిపించాలనుకునేవారు ఈ అలవాట్లకు ఎంత త్వరగా దూరమైతే అంత మంచిది.
వయస్సు పైబడ్డా సరే నవయవ్వనంగా, ఎనర్జిటిక్‌గా ఉండాలంవయసు పెరిగినా యవ్వనంగా, ఉత్సాహంగా కనిపించాలంటే మంచి ఆహారం తీసుకుంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి. ఈ చిన్న మార్పులతో చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇక పోషకాలతో కూడిన సమతుల్యాహారాన్ని ఎంచుకోవడంతో పాటు సరైన జీవన విధానాన్ని పాటించడం ఎంతో అవసరం. ఇలాంటి చిన్నపాటి అలవాట్లను దైనందిన జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా చర్మాన్ని సుదీర్ఘకాలం ఆరోగ్యకరంగా ఉంచుకోవచ్చు.
