కోట్ల ఆస్తి కాదు అదే ముఖ్యం.. అమ్మాయిల కొత్త కోరికలు!
లక్షల్లో జీతం, కోట్లలో ఆస్తి, విదేశాల్లో స్థిరపడటం... ఒకప్పుడు పెళ్లి సంబంధం కుదరాలంటే ఇవే మెయిన్ క్వాలిఫికేషన్స్. కానీ, ఇప్పుడు ట్రెండ్ రివర్స్ అయింది!
By: Madhu Reddy | 24 May 2026 8:00 PM ISTలక్షల్లో జీతం, కోట్లలో ఆస్తి, విదేశాల్లో స్థిరపడటం... ఒకప్పుడు పెళ్లి సంబంధం కుదరాలంటే ఇవే మెయిన్ క్వాలిఫికేషన్స్. కానీ, ఇప్పుడు ట్రెండ్ రివర్స్ అయింది! ‘రూపం కంటే గుణం ముఖ్యం’ అనే సామెతను పక్కన పెట్టేసి.. కోట్ల జీతం కంటే, తలపై జుట్టే ముఖ్యమని యువత తెగేసి చెబుతోంది. పెళ్లిళ్లలో వైరల్ అవుతున్న ఈ క్రేజీ ట్రెండ్స్, యువత మైండ్‌సెట్ మార్పు గురించి మనము తెలుసుకుందాం..
జీతం కాదు… లుక్సే మేటర్:
ఈ రోజుల్లో పెళ్లి సంబంధాల మార్కెట్ పూర్తిగా మారిపోయింది. అబ్బాయికి ఎంత పెద్ద ఉద్యోగం ఉన్నా, బ్యాంక్ బ్యాలెన్స్ కోట్లలో ఉన్నా సరే... చూడటానికి స్మార్ట్‌గా లేకపోతే అమ్మాయిలు రిజెక్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా బట్టతల ఉన్న అబ్బాయిలను పెళ్లి చేసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపించడం లేదని మ్యాచ్‌మేకర్లు చెబుతున్నారు.
యువతకు పెళ్లంటే ఒక యుద్ధం:
ఒకప్పుడు చదువు, ఉద్యోగం వస్తే పెళ్లి అయిపోతుందనే ధీమా ఉండేది. కానీ ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ఒక పెద్ద యుద్ధంలా మారింది. ఇక సరైన సంబంధం దొరకడానికే ఏళ్లు పడుతోంది. "పెళ్లి అవుతుందా? లేదా?" అనే టెన్షన్, ఆలోచనలతోనే యువతకు సగం వయసు అయిపోతోందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి.
అబ్బాయిల్లో పెరిగిన అభద్రతాభావం:
జీవితంలో ఎంతో కష్టపడి, మంచి పొజిషన్‌కు రీచ్ అయినా... కేవలం లుక్స్ బాలేవనే కారణంతో రిజెక్షన్స్ ఎదురవుతుండటంతో అబ్బాయిల్లో అభద్రతాభావం పెరిగిపోతోంది. ఇక కెరీర్ పక్కన పెట్టి మరీ హెయిర్ ప్లాంటేషన్లు, బ్యూటీ ట్రీట్‌మెంట్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తోంది.
అమ్మాయిల ఆలోచనలు మారాయి:
ఇక ఇప్పుడు అమ్మాయిలు కూడా చదువుల్లో, ఉద్యోగాల్లో అబ్బాయిలతో సమానంగా సంపాదిస్తున్నారు. వాళ్లకు అబ్బాయి సంపాదన కంటే, తమ పక్కన ఉండే పార్ట్‌నర్ చూడటానికి పర్‌ఫెక్ట్‌గా, స్టైలిష్‌గా ఉండాలనే కోరిక ఎక్కువగా ఉంటోంది. ఇక అందుకే ఫైనాన్షియల్ స్టేటస్ కంటే బాహ్యరూపానికే ఓటేస్తున్నారు.
డబ్బు, హోదా కంటే అందానికే పెద్దపీట వేసే ఈ కొత్త ట్రెండ్ సమాజంలో సరికొత్త చర్చకు దారితీస్తోంది. బాహ్య సౌందర్యం తాత్కాలికమే అయినా, ప్రస్తుత జనరేషన్ మాత్రం దాన్నే ప్రామాణికంగా తీసుకుంటోంది. మరి ఈ లుక్స్ ముఖ్యం అనుకునే ట్రెండ్ మున్ముందు ఇంకెన్ని మార్పులు తెస్తుందో చూడాలి.
