అంగు ఆర్భాటాలు వద్దు.. ఫ్యూచరే ముఖ్యం!
అంగు ఆర్భాటాలను పక్కన పెట్టి, భవిష్యత్తుకు భరోసానిచ్చే మార్గాలను వెతుక్కుంటున్న యువత కొత్త ఆలోచనా విధానం పైన మనం ఓ లుక్ వేద్దాం..
By: Madhu Reddy | 9 March 2026 5:23 PM ISTఒకప్పుడు ఖరీదైన ఫోన్లు, బ్రాండెడ్ బట్టలే యువతకు లోకం. కానీ ఇప్పుడు సీన్ మారింది! నేటి జెన్-జీ యువత ఆడంబరాల కంటే 'ఆదాయం' ఎక్కడ వస్తుందో అక్కడే అడుగులు వేస్తోంది. ఐఫోన్ కొని స్టేటస్ చూపించుకోవడం కంటే, అదే డబ్బుతో రెట్టింపు లాభాలు ఇచ్చే వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టడమే అసలైన 'లగ్జరీ' అని నమ్ముతోంది. అంగు ఆర్భాటాలను పక్కన పెట్టి, భవిష్యత్తుకు భరోసానిచ్చే మార్గాలను వెతుక్కుంటున్న యువత కొత్త ఆలోచనా విధానం పైన మనం ఓ లుక్ వేద్దాం..
ఐఫోన్ కాదు.. ఇన్కమ్ యాంగిల్ ముఖ్యం:
ప్రస్తుతం జెన్-జీ యువత ప్రతి విషయాన్ని 'ఇన్కమ్ యాంగిల్' లోనే ఆలోచిస్తోంది. ఒకప్పుడు ఐఫోన్ చేతిలో ఉంటే అది ఒక స్టేటస్ సింబల్. కానీ ఇప్పుడు, దాదాపు లక్షల ఖర్చుతో ఫోన్ కొనే బదులు, అదే డబ్బును మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ లేదా చిన్నపాటి భూముల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. వీటన్నిటి కంటే వినూత్నంగా పిగ్ ఫామ్స్ , డాంకీ ఫార్మ్స్ వంటి రంగాలను ఎంచుకుంటున్నారు. ఒక ఐఫోన్ కొనే డబ్బుతో పిగ్ ఫామ్ మొదలుపెడితే, వాటి బర్త్ సైకిల్స్ వల్ల కేవలం రెండేళ్లలోనే మూడు రెట్లు ఆదాయం వస్తుందని లెక్కలు వేస్తున్నారు. అంటే, కనిపించే ఆడంబరం కంటే పెరిగే ఆదాయమే వీరికి ముఖ్యం.
సింపుల్ లైఫ్.. ఫ్రీడమే అసలైన లగ్జరీ:
నేటి తరం ట్రెండ్‌ల వెంట పడటం కంటే విలువలతో కూడిన జీవితం గడపడమే మేలని భావిస్తోంది. అనవసరమైన షో-ఆఫ్ కోసం అప్పులు చేయడం కంటే, ఉన్నంతలో సింపుల్‌గా ఉంటూ 'పీస్ ఆఫ్ మైండ్' ని వెతుక్కుంటున్నారు. ఒకప్పుడు లగ్జరీ అంటే ఖరీదైన వస్తువులు అనుకునేవారు, కానీ ఇప్పుడు ఫైనాన్సియల్ ఫ్రీడమ్ పొందడమే అసలైన లగ్జరీ అని వీరు డిసైడ్ అయ్యారు. అందుకే స్టేటస్ సింబల్స్ కోసం కాకుండా, రేపు మనం పని చేయకపోయినా డబ్బు వచ్చే మార్గాలను నిర్మించుకోవడంలో బిజీగా ఉన్నారు.
ఉద్యోగాలపైనే కాదు.. రిటర్న్స్ పైనే ఫోకస్:
జెన్-జీ కి కేవలం ఒక్క ఉద్యోగాన్ని మాత్రమే నమ్ముకుని బతకడం ఈ రోజుల్లో ఎంత రిస్క్కో బాగా తెలుసు. అందుకే చిన్న చిన్న ఇన్వెస్ట్‌మెంట్ల నుంచి విభిన్నమైన వ్యవసాయ ఆధారిత వ్యాపారాల వరకు ఎక్కడ రిటర్న్స్ ఎక్కువగా ఉంటే అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. గాడిదల పెంపకం లేదా పందుల పెంపకం వంటి వాటిని గతంలో తక్కువగా చూసేవారు, కానీ ఇప్పుడు యువత వాటిలోని బిజినెస్ పొటెన్షియల్‌ని చూస్తోంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఎక్కడ వస్తాయి? మన ఫ్యూచర్ సేవింగ్స్ ఎలా పెరుగుతాయి? అనే అంశాలకే నేటి తరం ఫస్ట్ ప్రయారిటీ ఇస్తోంది. అంగు ఆర్భాటాలు తాత్కాలికమే కానీ, తెలివైన పెట్టుబడులే మనల్ని లైఫ్ లాంగ్ కాపాడతాయి. ఇక జెన్-జీ చూపిస్తున్న ఈ కొత్త దారి అందరికీ ఒక పాఠం లాంటిది.
