పెర్ఫ్యూమ్ వాడుతున్నారా.. అయితే ఈ టిప్స్ తప్పనిసరి!
అయితే ఇలా వేసుకున్న పెర్ఫ్యూమ్ మన ఒంటి మీద ఎక్కువ సేపు నిలిచి సువాసన రావాలి అంటే కచ్చితంగా ఈ చిట్కాలు పాటించాల్సిందే అంటున్నారు కొంతమంది నిపుణులు.
By: Madhu Reddy | 11 Oct 2025 10:03 AM ISTపెర్ఫ్యూమ్ చాలామంది తమ బాడీలో ఉండే చెమట వాసన బయటికి రాకూడదు అనే ఉద్దేశంతో వాడతారు. అయితే ఇలా పెర్ఫ్యూమ్ వేసుకొని బయటకు వెళ్లిన సమయంలో మన ఒంట్లో ఉన్న చెమట వాసన బయటికి రాకుండా పెర్ఫ్యూమ్ మనల్ని రక్షిస్తుంది. అలాంటి పెర్ఫ్యూమ్ ను ఎలా పడితే అలా వాడకుండా కొన్ని టిప్స్ పాటిస్తూ.. ఈ విధంగా అప్లై చేస్తే ఎక్కువ సేపు ఉంటుంది. మరి పెర్ఫ్యూమ్ ను అప్లై చేసేటప్పుడు ఎలా అప్లై చేయాలి? పైగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రస్తుత సమాజంలో పెర్ఫ్యూమ్ వాడే వారి సంఖ్య అధికంగా పెరుగుతోంది. ఒకప్పుడు చాలా తక్కువ మంది దీనిని యూస్ చేసేవారు. కానీ ఇప్పుడు చిన్నపిల్లల నుండి మొదలు ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు బయటకు వెళ్తే చాలు పెర్ఫ్యూమ్ లను ఉపయోగిస్తున్నారు. అయితే ఇలా వేసుకున్న పెర్ఫ్యూమ్ మన ఒంటి మీద ఎక్కువ సేపు నిలిచి సువాసన రావాలి అంటే కచ్చితంగా ఈ చిట్కాలు పాటించాల్సిందే అంటున్నారు కొంతమంది నిపుణులు.
ఆ చిట్కాలు ఏంటంటే..
1.పెర్ఫ్యూమ్ పొడిగా ఉన్న చర్మం మీద కాకుండా స్నానం చేసిన వెంటనే కాస్త తడిగా ఉన్నప్పుడే స్ప్రే చేసుకుంటే ఎక్కువసేపు సువాసన వస్తుందట.
2. సీజన్లకు తగ్గట్టు పెర్ఫ్యూమ్ లను మారుస్తూ ఫ్రెష్ అయిన వెంటనే పెర్ఫ్యూమ్ స్ప్రే చేసుకోవాలని చెబుతున్నారు.
3. ఈ పెర్ఫ్యూమ్ స్ప్రే చేసుకునేటప్పుడు ఎక్కువగా మెడ, పల్స్ పాయింట్స్, చెవి వెనుక, మోకాళ్ళ వెనక భాగంలో స్ప్రే చేసుకోవడం ఉత్తమం. ఎందుకంటే ఈ భాగాల్లోనే ఎక్కువగా చెమట పడుతుంది.
4.అయితే మనం వేసుకున్న స్ప్రే ఎక్కువసేపు మన బాడీపై ఉండి సువాసనలు వెదజల్లాలి అంటే ముందుగా బాడీకి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. మాయిశ్చరైజర్ రాసి ఆ తర్వాత పెర్ఫ్యూమ్ స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది.
5.ఇక కొంతమంది పెర్ఫ్యూమ్ అప్లై చేసిన వెంటనే వాటిని రుద్దుతూ ఉంటారు. అలా రుద్దడం వల్ల పెర్ఫ్యూమ్ స్మెల్ మారడంతోపాటు ఎక్కువసేపు సువాసన రాదు. స్ప్రే చేసిన కొద్దిసేపటి వరకు దానిని ఆరనివ్వాలి.
6.ఈ పెర్ఫ్యూమ్ సువాసన ఎక్కువసేపు ఉండాలి అంటే వేసుకున్న బట్టల పై లేదా జుట్టుపై స్ప్రే చేయాలి. అయితే ఈ మధ్యకాలంలో మార్కెట్లోకి కొత్తగా హెయిర్ స్ప్రే లు కూడా వచ్చాయి. వాటిని యూస్ చేయడం కూడా మంచిదే.
7.వేసుకున్న పెర్ఫ్యూమ్ ఎక్కువసేపు ఉండాలి అంటే మనం వేసుకునే ఆ పెర్ఫ్యూమ్ కి సరిపోయే ఆయిల్ లేదా బాడీ లోషన్ ని ఎంచుకుంటే ఆ పెర్ఫ్యూమ్ మరింత ఎక్కువసేపు ఉంటుంది.
చివరిగా.. పెర్ఫ్యూమ్ వేసుకోవడం మంచిదే. కానీ శరీరంలోని కొన్ని సున్నిత భాగాలపై నేరుగా పెర్ఫ్యూమ్ వేయడం వల్ల అది హాని కలిగిస్తుంది. అందుకే సున్నిత భాగాలపై పెర్ఫ్యూమ్ నేరుగా వాడకూడదు. అలా పెర్ఫ్యూమ్ వేసుకునేటప్పుడు ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే ఎక్కువసేపు పెర్ఫ్యూమ్ ఒంటి పై ఉండి సువాసనలు వెదజల్లుతుంది.
