Begin typing your search above and press return to search.

మగాళ్లే కాదు.. పెళ్లైన ఆడోళ్లకి క్రష్ ఎక్కువేనంట

By:  Tupaki Desk   |   7 Aug 2015 7:48 AM GMT
మగాళ్లే కాదు.. పెళ్లైన ఆడోళ్లకి క్రష్ ఎక్కువేనంట
X
పెళ్లి అయిన తర్వాత కూడా అమ్మాయిల వంక ఆరాధనగా చూడటం.. అందమైన స్త్రీ పట్ల కాస్తంత మమకారం పెంచుకోవటం.. అవకాశం లభిస్తే అన్నట్లుగా పురుషులు ఉండటంపై ఇప్పటికే కొంతమంది పరిశోధకులు తేల్చిన విషయం తెలిసిందే.

ఇలాంటి విషయాలు ఒక్క మగాళ్లే కాదు.. మహిళలకు.. అదీ పెళ్లి అయిన ఆడోళ్లలోనూ ఎక్కువేనని తాజాగా నిర్వహించిన ఒక పరిశోధన తేల్చింది. పెళ్లి తర్వాత పరాయి పురుషుల పట్ల ఆకర్షణ ఎక్కువే ఉంటుందని.. నూటికి 60 నుంచి 70 మంది వరకు మహిళల్లో ఉంటుందని తేల్చారు. అయితే.. ఇక్కడ గమనించాల్సిన అంశం.. పెళ్లి అయిన ఆడోళ్లు.. పరాయి పురుషుల పట్ల ఆకర్షణ ఉంటుందే తప్ప.. వారితో లైంగికత కోరుకోరన్నది గమనార్హం.

పెళ్లి తర్వాత పరాయి పురుషుల పట్ల ఆకర్షణ.. ఆరాధన ఉన్నప్పటికీ.. ఈ 60 నుంచి 70 శాతం మహిళలు.. వీలైనంత ఎక్కువ మంది ఆ విషయాన్ని తమ మనసుల్లోనే ఉంచుకుంటారే తప్పించి.. బయట పెట్టేందుకు అస్సలు ఇష్టపడరట. తమ మనసులోని భావనల్ని ఎవరికి చెప్పకుండా తమలోనే ఉంచుకుంటారని.. పరాయి పురుషులతో లైంగిక ఆనందం వారు కోరుకోరన్న విషయాన్ని తాము గుర్తించినట్లుగా తాజా పరిశోధనలో వెల్లడైనట్లు చెబుతున్నారు.

ఆకర్షణ అన్నది సహజమని.. అయితే.. ఇలాంటివి అవతలి వ్యక్తితో అనుబంధాన్ని కోరుకోనంత వరకూ తప్పు పట్టాల్సిన అవసరం లేదని సదరు పరిశోధకులు చెబుతున్నారు. పురుషుల మాదిరే స్త్రీ మనుషులే కదా.. వారిలో ఆ మాత్రం ఫీలింగ్స్ తప్పేం కాదు సుమి.