సుప్రీం లక్ష్మణ రేఖ: 8 వారాల్లో కుక్కలను తరలించాల్సిందే!
8 వారాల్లోగా.. అన్ని బహిరంగ ప్రదేశాల నుంచి వీధి కుక్కలను తరలించాలని.. వాటి కోసం ప్రత్యేకంగా షెల్టర్లు ఏర్పాటు చేయాలని పేర్కొంది.
By: Garuda Media | 7 Nov 2025 3:54 PM ISTవీధి కుక్కల వ్యవహారంపై సుప్రీంకోర్టు మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది. గత కొన్నాళ్లుగా తీవ్ర వివా దంగా ఉన్న ఈ అంశంపై తాజాగా మరోసారి సంచలన ఉత్తర్వులు ఇచ్చింది. కేంద్రం, రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ ఆదేశాలు `లక్ష్మణ రేఖ` వంటిదని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. 8 వారాల్లోగా.. అన్ని బహిరంగ ప్రదేశాల నుంచి వీధి కుక్కలను తరలించాలని.. వాటి కోసం ప్రత్యేకంగా షెల్టర్లు ఏర్పాటు చేయాలని పేర్కొంది.
ఈ మేరకు సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఇక, ఈ ఉత్తర్వుల్లో రాష్ట్రాలు.. కేంద్ర పాలిత ప్రాంతాలకు కీలక సూచనలు చేసింది. నిద్రాణంగా ఉన్న వ్యవస్థను తాము మేల్కొలపాల్సి వచ్చిందన్న న్యాయమూర్తి.. ఇప్పటికైనా వీధి కుక్కల నుంచి సమాజాన్ని కాపాడాలని సూచించింది. తాజా ఉత్తర్వులపై ఎలాంటి అభ్యంతరాలు ఉండరాదని.. కూడా స్పస్టం చేసింది. ప్రతి ఒక్కరికీ ఇబ్బందిగా ఉన్న వీధి కుక్కలను దూరంగా షల్టర్లలో సంరక్షించవచ్చని తెలిపింది.
ఎక్కడెక్కడంటే..
+ దేశవ్యాప్తంగా అన్ని పార్కులు.
+ సినిమాహాళ్లు.
+ క్రికెట్ మైదానాలు.
+ బస్టాండ్ ప్రాంతాలు.
+ రైల్వే స్టేషన్‌లు.
+ చిన్నారులు చదివే పాఠశాలలు.
+ విద్యాలయాలు.
+ ప్రముఖ కార్యాలయాలు.
+ కోర్టులు, బ్యాంకుల ప్రాంగణాలు.
ఇలా.. జన సంచారం ఎక్కువగా ఉండే ప్రతి బహిరంగ ప్రదేశం నుంచి కుక్కలను తరలించాలని కోర్టు ఆదేశించింది. అంతేకాదు.. ప్రతి రోజూ ఆయా ప్రాంతాల్లో గస్తీ చేపట్టాలని.. ఒక్క కుక్క పట్ల కూడా ఉదారంగా వ్యవహరించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. అంతేకాదు.. ప్రతి వారం క్రమం తప్పకుండా రాత్రివేళలో కూడా గస్తీ చేపట్టాలని ఆదేశించింది. షెల్టర్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వాలు సొమ్ములు కేటాయించాలని స్ఫస్టం చేసింది. తదుపరి విచారణను జనవరి 13కు వాయిదా వేసింది.
