Begin typing your search above and press return to search.

దేవుడి సొమ్ము బ్యాంకుల పాలు అంటే ఇదేనేమో?

కానీ బ్యాంకులు మాత్రం బడాబాబులకు అప్పనంగా దోచిపెడుతూ ఇలా అప్పనంగా వచ్చే దేవుడి సొమ్మును తమ వద్దే ఉంచాలని ఏకంగా కోర్టుకు ఎక్కడ దారుణమనే చెప్పొచ్చు.

By:  A.N.Kumar   |   5 Dec 2025 10:26 PM IST
దేవుడి సొమ్ము బ్యాంకుల పాలు అంటే ఇదేనేమో?
X

రాజుల సొమ్ము రాళ్ల పాలు అన్న సామెత ఎంతో ఫేమస్.. కానీ ఇప్పుడు మనం దేశంలో ‘దేవుడి సొమ్ము బ్యాంకుల పాలు’ అని మార్చి రాయాలేమో.. కొన్ని బ్యాంకులు దేవుడి సొమ్మును తమ ఆర్థిక మనగడకు వాడుకుంటున్న తీరు చూసి ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిందంటే ఆ బ్యాంకుల ఆర్థిక అస్తవ్యస్థత ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు.

సామాన్యుడికి కేవలం లక్ష లోను కావాలంటే ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించే బ్యాంకులు.. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ లాంటి వారికి 12 వేల కోట్లు, 10 వేల కోట్లను అప్పుగా ఇచ్చేసి వారు దేశం విడిచి వెళ్లినా చోద్యం చూస్తూ కేసుల వేస్తూ కాలం గడుపుతుంటాయి. నిజానికి బ్యాంకులు దివాళా తీయడానికి సగటు రైతు, సగట మధ్యతరగతి అప్పు చేసిన సగటు మనుషులు ఎప్పుడూ కారు. వాళ్లు ఆస్తులు అమ్ముకొనో బంగారు తాకట్టు పెట్టో బ్యాంకుల అప్పులు తీర్చేస్తుంటారు. కానీ బ్యాంకులు మాత్రం బడాబాబులకు అప్పనంగా దోచిపెడుతూ ఇలా అప్పనంగా వచ్చే దేవుడి సొమ్మును తమ వద్దే ఉంచాలని ఏకంగా కోర్టుకు ఎక్కడ దారుణమనే చెప్పొచ్చు.

అసలు కథ ఏంటంటే.. కేరళలోని ప్రసిద్ధం తిరునెల్లి దేవస్థానం చేసిన కోట్ల రూపాయల ఫిక్స్ డ్ డిపాజిట్లను తిరిగి ఆ దేవాలయానికి చెల్లించాలని కేరళ హైకోర్టు గతంలో ఆదేశించింది. సహకార బ్యాంకల్లో తక్కువ వడ్డీ వస్తుంది. అదే జాతీయ ప్రైవేటు బ్యాంకల్లో ఎక్కువ వడ్డీ వస్తుంది. తద్వారా ఆలయ నిర్వహణకు ఆ డబ్బు ఉపయోగపడుతుంది.

అయితే దేవాలయం చేసిన ఫిక్స్ డ్ డిపాజిట్లను తిరిగి ఇచ్చేందుక కేరళలోని సహకార బ్యాంకులైన మునాంతవాడి కోఆపరేటివ్ అర్బన్ సొసైటీ లిమిటెడ్, తిరునెల్లి సర్వీస్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ సహా కొన్ని సహకార బ్యాంకల సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ పిటీషన్ ను స్వయంగా విచారించిన చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ధర్మసానం శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేసింది.

ఆలయాలకు చెందిన డబ్బును ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కోఆపరేటివ్ బ్యాంకులను రక్షించేందుకు ఉపయోగించవద్దని.. సొమ్మను పూర్తిగా దేవుడికి చెందినదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఈ నిధులను కేవలం ఆలయ ప్రయోజనాలకు మాత్రమే ఉపయోగించాలని స్పష్టం చేసింది. సహకార బ్యాంకులు అప్పల్లో ఉంటే వాటి నిర్వహణ కష్టముందే దేవుడి సొమ్మును ఆదాయ వనరుగా చూడొద్దని.. వాటి మనగడ కోసం దేవుడి ఆలయ నిధుల వాడొద్దని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఆలయ డబ్బుతో బ్యాంకును రక్షించుకోవాలనుకుంటున్నారా? కష్టాల్లో ఉన్న సహకార బ్యాంకులో డబ్బు ఉంచే బదులు, ఎక్కువ వడ్డీ ఇచ్చే జాతీయ బ్యాంకులో ఆలయ నిధులను మార్చాలని ఆదేశించడంలో తప్పులేదని కోర్టు తీర్పునిచ్చింది. మీరు ప్రజల్లో విశ్వసనీయత పెంచుకుంటే కస్టమర్లు వస్తారని.. డిపాజిట్లను ఆకర్షించలేకపోతే అది మీ బ్యాంకు సమస్య అంటూ ఘాటుగా సమాధానమిచ్చింది.