Begin typing your search above and press return to search.

రేప్ చేస్తే చావే గతి .. కామాంధులూ ఖబడ్దార్ !

ఇదిలా ఉంటే ఈ ప్రపంచంలో అనేక దేశాలు రేపిస్టులకు కఠినమైన శిక్షలతో పాటు ఏకంగా మరణ దండనను విధిస్తున్నాయి.

By:  Satya P   |   6 Oct 2026 8:32 AM IST
రేప్ చేస్తే చావే గతి .. కామాంధులూ ఖబడ్దార్ !
X

రేప్ చేయడం అన్నది భారత్ లో నానాటికీ అధికం అవుతోంది. రేప్ చేసిన వారు కొన్నాళ్ళు జైలులో ఉంటూ తిరిగి బయటకు వస్తున్నారు. మళ్లీ షరా మామూలుగానే పరిస్థితి ఉంది. దాంతో కామాంధులకు ఎక్కడా భయం అన్నది లేకుండా పోతోంది. దీని మీదనే దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతంలో మహిళలపై జరుగుతున్న వరుస లైంగిక దాడుల ఘటనలపైన సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ఘోరాలకు పాల్పడే నేరస్థులకు చావు భయం పుట్టేలా కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.

సుమోటోగా స్వీకరణ :

ఇదిలా ఉంటే నెల రోజుల వ్యవధిలోనే ఢిల్లీలో 13 దాకా లైంగిక దాడుల కేసులు నమోదు కావడం సంచలనం రేపింది. , ముఖ్యంగా ఆస్థా కుంజ్ పార్క్‌లో ఒక పదిహేడేళ్ళ మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ చేసిన ఘటన సంచలనం రేపింది. కదులుతున్న స్లీపర్ బస్సులో బాలికపై లైంగిక దాడి ఘటన దేశవ్యాప్తంగా చర్చగా మారింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ వ్యవహారాన్ని సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ సందర్భనగ కీలక వ్యాఖ్యలను కూడా చేసింది. మహిళలపై లైంగిక దాడులు లేదా వేధింపులకు పాల్పడాలంటేనే అసాంఘిక శక్తులకు ఒంట్లో వణుకు పుట్టేలా పోలీసుల వ్యూహం ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

రాత్రి సైతం భద్రత :

అంతే కాదు మహిళలు రాత్రి 10 గంటల సమయంలో కూడా రోడ్లపై నడుస్తున్నప్పుడు లేదా మెట్రో రైలు ఇతర పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ప్రయాణిస్తున్నప్పుడు పూర్తిగా సురక్షితంగా ఉన్నామనే భావన కలగాలని కోర్టు పేర్కొంది. ఇవన్నీ కేవలం కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో భద్రతను పటిష్టం చేయాలని ఆదేశించింది. మహిళల భద్రత కోసం తీసుకున్న తక్షణ నివారణ చర్యలపై నివేదిక సమర్పించాలని ఢిల్లీ పోలీసులన కేంద్ర హోం మంత్రిత్వ శాఖను ఆదేశిస్తూ తదుపరి విచారణను నవంబర్ 16వ తేదీకి సుప్రీం కోర్టు వాయిదా వేసింది. ఈ సందర్భంగా సుప్రీం కఒర్టు చేసిన వ్యాఖ్యలు అయితే అందరిలో ఆలోచనలు రేకెత్తించేలా ఉన్నాయి. రేపిస్టులకు చావు భయం మెదళ్ళలోనే రావాలని ఆ పనికి ముందే వారు భయపడాలని పేర్కొనడం పట్ల పెద్ద చర్చ సాగుతోంది.

ఆ దేశాల్లో చూస్తే :

ఇదిలా ఉంటే ఈ ప్రపంచంలో అనేక దేశాలు రేపిస్టులకు కఠినమైన శిక్షలతో పాటు ఏకంగా మరణ దండనను విధిస్తున్నాయి. అలాంటి దేశాల జాబితాలో చూస్తే సౌదీ అరేబియా ముందు ఉంది. ఇక్కడ షరియా చట్టం ప్రకారం అత్యాచారానికి పాల్పడిన దోషులకు బహిరంగంగా మరణశిక్ష విధిస్తారు. వారి తల నరకడం లేదా కాల్చి చంపడం వంటివి చేస్తారు. అలాగే ఇరాన్ దేశంలో ఇస్లామిక్ పీనల్ కోడ్ ప్రకారం తీవ్రమైన అత్యాచార కేసుల్లో దోషులకు మరణశిక్ష అమలు చేస్తారు. బంగ్లాదేశ్ లో మహిళలపై పెరుగుతున్న నేరాలను అరికట్టడానికి అత్యాచార కేసుల్లో మరణశిక్ష లేదా జీవిత ఖైదు విధించేలా చట్టాన్ని సవరించారు. ఇక చైనాలో చూస్తే బాధితులకు తీవ్ర గాయాలైనా సామూహిక అత్యాచారాలైనా లేదా మరణం సంభవించినా దోషులకు మరణశిక్ష విధిస్తారు.

అత్యంత కఠినంగా :

పాకిస్తాన్ దేశంలో సామూహిక అత్యాచార కేసులలో దోషులకు మరణశిక్ష లేదా కఠినమైన జీవిత ఖైదు విధిస్తారు. ఇక ఇండోనేషియాలో పిల్లలపై లైంగిక దాడులకు పాల్పడే వారికి రసాయన వంధ్యీకరణ శిక్షను అమలు చేస్తారు. అంటే వారు నపుంసకులుగా మారుతారు అన్న మాట. అలాగే వారికి మరణ శిక్ష ఎలక్ట్రానిక్ ట్యాగింగ్ వంటి చట్టాలు అమలులో ఉన్నాయి.ఇక భారతదేశంలో చూస్తే క్రిమినల్ లా అమెండ్‌మెంట్ ప్రకారం నిర్దిష్టమైన తీవ్రమైన అత్యాచారాలకు అంటే చిన్న పిల్లలపై అఘాయిత్యాలు లేదా బాధితురాలు కోమాలోకి వెళ్లడం మరణించడం వంటి ఘటనలకు సంబంధించి మరణ శిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తారు. అయితే ఈ శిక్షలు కచ్చితంగా అమలు జరగాలి. ముఖ్యంగా సుప్రీంకోర్టు చెప్పినట్లుగా రేప్ అన్న ఆలోచన పురుషులలో కలుగకుండా వారి మెదళ్ళలను ఈ కఠిన శిక్షలు అక్కడే ఆపేసేలా ఉండాలని అంటున్నారు.