ఆధార్ తో అవన్నీ కుదరవు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!
అనేక రాష్ట్రాల్లో ఎన్నికల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ (సర్) కోసం ఎన్నికల సంఘం చేస్తున్న ఒత్తిడిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే.
By: Raja Ch | 27 Nov 2025 4:06 PM ISTఅనేక రాష్ట్రాల్లో ఎన్నికల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ (సర్) కోసం ఎన్నికల సంఘం చేస్తున్న ఒత్తిడిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. ఈ సమయంలో తుది వాదనలు ప్రారంభించగా.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇందులో భాగంగా... ఆధార్ ను పౌరసత్వానికి నిస్సందేహమైన రుజువుగా పరిగణించలేమని స్పష్టం చేసింది.
అవును... తమిళనాడు, బెస్ట్ బెంగాల్, కేరళ లో “సర్” కసరత్తుపై ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ లపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మల్యా ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇందులో భాగంగా.. భారతదేశ పౌరసత్వానికి ఆధార్ ప్రూఫ్ కాదని స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా ధర్మాసనం పలుకు కీలక ప్రశ్నలు సంధించింది. ఇందులో భాగంగా... ఆధార్ సామాజిక సంక్షేమ ప్రయోజనాలు అందరికీ చేరేలా చూసుకోవడానికి ఏర్పాటు చేసింది మాత్రమే అని చెబుతూ.. రేషన్ కోసం ఆధార్ పొందిన వ్యక్తిని ఓటర్ ని చేయాలా? ఇక్కడ కార్మికుడిగా విదేశాలకు చెందిన వ్యక్తి పనిచేసే అతడిని ఓటు హక్కు కల్పించాలా? అని ధర్మాసనం ప్రశ్నించింది.
కపిల్ సిబాల్ వాదనలు ఇవే!:
ఈ సమయంలో పలువురు పిటిషనర్ల తరుపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా "సర్" ప్రక్రియ సాధారణ పౌరులపై రాజ్యాంగ విరుద్ధమైన భారాన్ని మోపుతుందని.. నిరాక్ష్యరాసులైన అనేక మందిని వారిలో ఉన్నారని.. ఈ మొత్తం ప్రక్రియ ప్రజాస్వామ్యాన్ని ప్రభావితం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
అయితే... ఇంతకు ముందు ఎన్నడూ ఇలాంటి సవరణ జరగలేదు అనే వాదనను ఎన్నికల కమిషన్ అధికారాన్ని అణగదొక్కడానికి ఉపయోగించరాదని ధర్మసనం పేర్కొంది. ఇదే సమయంలో... ఓటరు జాబితా నుంచి ఏదైనా తొలగింపు ఉంటే.. దానికి ముందుగా తగిన నోటీసులు ఇవ్వాలని పేర్కొంది. డిసెంబర్ 1 నాటికి దీనిపై ప్రతిస్పందన తెలియజేయాలని ఈసీని కోరింది.
