Begin typing your search above and press return to search.

వివాహానికి ముందు లైంగిక సంబంధం ...బహు పరాఖ్

కాలం మారింది. ఆలోచనలు మారిపోతున్నాయి. ఒకపుడు ఉన్న విలువలు ఇపుడు లేవని అంతా అంటున్నదే.

By:  Satya P   |   17 Feb 2026 12:09 AM IST
వివాహానికి ముందు లైంగిక సంబంధం ...బహు పరాఖ్
X

కాలం మారింది. ఆలోచనలు మారిపోతున్నాయి. ఒకపుడు ఉన్న విలువలు ఇపుడు లేవని అంతా అంటున్నదే. ఇక పెళ్ళి అన్నది చట్టపరమైన సమాజం అంగీకరించే శారీరక బంధానికి లైసెన్స్. కానీ దానిని దాటించి పెళ్ళి కంటే ముందు శృంగారం కోరుకునే తరం వర్తమానంలో సాగుతోంది. శృంగారానికి పెళ్ళి మాత్రమే కావాలా అని వాదించే వారూ ఉన్నారు. పెళ్ళి అన్న మాటే వద్దు, కానీ మిగిలినవి అన్నీ కావాలని అంటున్న వారూ ఉన్నారు. ఇందులో మోసాలు ఎన్నో జరుగుతున్నాయి. తీరా అంతా అయిపోయాక కోర్టు మెట్లు ఎక్కి న్యాయం కోరుతున్నారు. దీని మీద దేశ అత్యున్నత న్యాయస్థానం తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది.

అందరూ అపరిచితులే :

ఇదిలా ఉంటే ఫిబ్రవరి 16న సుప్రీం కోర్టు పెళ్లి చేసుకుంటానని తప్పుడు హామీ ఇచ్చి అత్యాచారం చేశారనే ఆరోపణలతో కూడిన కేసులో బెయిల్ పిటిషన్‌ను విచారిస్తున్నప్పుడు కీలక వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి బి.వి. నాగరత్న జస్టిస్ ఉజ్వల్ ఈ కేసు విచారిస్తున్నారు ఈ సనర్భంగా అత్యున్నత న్యాయస్థానం వివాహానికి ముందు లైంగిక సంబంధాలలో జాగ్రత్త వహించాలని కోరుతూ మౌఖిక వ్యాఖ్యలు చేసింది. వివాహానికి ముందు అందరూ అపరిచితులే అని పేర్కొంది. దీని మీద జస్టిస్ నాగరత్న మౌఖిక వ్యాఖ్యలు చేస్తూ బహుశా మనం పాతకాలపు వాళ్ళమే కావచ్చు కానీ వివాహానికి ముందు అబ్బాయి లేదా అమ్మాయి అపరిచితులు అన్నది గుర్తుంచుకోవాలని అన్నారు.

ఎవరినీ నమ్మకూడదంటూ :

అంతే వివాహానికి ముందు యువత శారీరక సంబంధంలో ఎలా మునిగిపోతారో అర్థం చేసుకోవడంలో సమాజంగా విఫలమవుతున్నామని అన్నారు. బహుశా మేము పాతకాలపు వాళ్ళమే కావచ్చు కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని హితవు చెప్పారు. వివాహానికి ముందు ఎవరూ ఎవరినీ నమ్మకూడదని ఆమె పేర్కొన్నారు. వివాహహామీ విచ్ఛిన్నమైన కేసులను వెంటనే క్రిమినల్ నేరాలుగా అంటే అత్యాచారంగా పరిగణించరాదని జస్టిస్ నాగరత్న జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. ఇదిలా ఉండగా 30 ఏళ్ల మహిళను వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చి అత్యాచారం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి బెయిల్ దరఖాస్తు విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు మౌఖికంగా చేసింది.

మంచి మాటలే :

సుప్రీంకోర్టు చెప్పినవి అన్నీ మంచి మాటలే అంటున్నారు. అయితే సమాజంలో మాత్రం సహ జీవనాలు పెరుతున్నాయి. అలాగే పెళ్ళి కంటే ముందు శారీరక బంధాలను కోరుకునే వారి సంఖ్య పెరుతోంది. ఆ మాటకు వస్తే పెళ్ళి వద్దు కానీ ఫిజికల్ రిలేషన్స్ కావాలని అనుకునే తరం కూడా ఉంది. అంతా బాగుంటే ఏ కేసూ ఉండదు, కానీ ఈ పెళ్ళికి ముందు ప్రమాణాలు విచ్చిన్నం అయి కధ మొదటికి వస్తే బాధితులకే తీరని అన్యాయం జరుగుతుంది అని అంటున్నారు.