Begin typing your search above and press return to search.

కాక్రోచ్ లపై మోడీ సర్కార్ ఫైట్ మొదలైంది.. సౌరవ్ ఫస్ట్ వికెట్.. లుకౌట్ నోటీసులు

నీట్ ఆందోళనలతో వార్తల్లో నిలిచిన సీజేపీ నేత సౌరవ్ దాస్‌కు కేంద్రం షాక్ ఇచ్చింది. లండన్ పర్యటనకు వెళ్లకుండా ముంబై పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. ఆయన పాస్‌పోర్టులో పేరు, చిరునామా, విద్యాభ్యాసం, తల్లిదండ్రుల వివరాల్లో తేడాలున్నాయని కేంద్రం కోర్టుకు తెలిపింది. అయితే తనకు నోటీసులు అందలేదని సౌరవ్ దాస్ కోర్టును ఆశ్రయించారు.

By:  A.N.Kumar   |   26 Nov 2026 11:05 PM IST
కాక్రోచ్ లపై మోడీ సర్కార్ ఫైట్ మొదలైంది.. సౌరవ్ ఫస్ట్ వికెట్.. లుకౌట్ నోటీసులు
X

నీట్ ఆందోళనలతో దేశాన్ని.. మోడీ సర్కార్ ను షేక్ చేసింది కాక్రోజ్ జనతా పార్టీ. ఈ కాక్రోచ్ ల దెబ్బకు.. విద్యార్థుల ఆందోళనకు మోడీ సర్కార్ దిగివచ్చింది.. విద్యార్థి లోకం ఆగ్రహజ్వాలలకు చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించింది. అయితే ఈ కాక్రోచ్ లు కేవలం నీట్ ఆందోళనలతోనే ఆగిపోలేదు. తర్వాత ఓట్ చోరీ అంటూ వివిధ ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలకు రంగం సిద్ధం చేసి అగ్గిరాజేస్తున్నారు..

అయితే ఈ కాక్రోచ్ ల ఆందోళనల వెనుక సోరోస్ అమెరికా, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీల లాబీ ఉందని బీజేపీ అనుమానిస్తోంది. అందుకే వీరికి వచ్చే నిధులు, వీరికి సపోర్టు చేసే వారిపై పెద్దనిఘానే పెట్టింది. ఇక సీజేపీ నేతలపై కూడా ఓకన్నేసి ఉంచింది. ఎక్కడ దొరుకుతారోనని ఎదురుచూసినట్టున్నారు. సరిగ్గా టైం చూసి దెబ్బకొడుతున్నారు.

తాజాగా సీజేపీ నేత సౌరవ్ దాస్ అడ్డంగా దొరికారు. ఆయన లండన్ వెళ్లి ఓ యూనివర్సిటీలో మోడీ సర్కార్ పై దుమ్మెత్తిపోయడానికి విమానం ఎక్కబోతుండగా.. మన అధికారులు ఆయన పాస్ పార్ట్ లో లోపాలున్నాయని ఆపేశారు. అంతేకాదు తాజాగా లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. దీంతో సౌరవ్ దాస్ కోర్టును ఆశ్రయించి కేంద్ర ప్రభుత్వాన్ని సవాల్ చేశారు.

అసలు ఈ లొల్లికి కారణం ఏంటయ్యా అంటే సౌరవ్ దాస్ పాస్ పోర్టులో లూప్ హోల్స్.. సౌరవ్ పాస్ పోర్టులో అతడి స్కూలింగ్, చిరునామా , పేరెంట్స్ కు సంబంధించిన వివరాల్లో తేడాలు ఉన్నట్లు గుర్తించామని కేంద్రం కోర్టులో తెలిపింది. ఈ మేరకు 23న ముంబై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపింది.

అయితే తనకు లుక్ ఔట్ నోటీసుల విషయం తెలియదని.. తనకు అందజేయలేదని.. ఢిల్లీ ఎయిర్ పోర్టుకు వెళ్లిన తర్వాతే షోకాజ్ నోటీసులు అందినట్లు సౌరవ్ దాస్ కోర్టుకు తెలిపారు. దీనికి కారణాలు తెలుపాలని.. ఉత్తర్వుల కాపీ ఇవ్వాలని దాస్ న్యాయవాదులను కోరారు.

దీంతో ఎక్కడ దొరుకుతారోనని ఎదురుచూస్తున్న బీజేపీ సర్కార్ కు ఓ కాక్రోచ్ చిన్న లూప్ హోల్ తో దొరికేశాడు. మరి దీంతో అతడి విదేశీ పర్యటన దూరమైంది. విచారణకు హాజరుకావాల్సిన పరిస్థితి. కేంద్రంపై పోరాడుతున్న ఈ సీజేపీ నేత మరి ఈ విషయంలో ఎలా ముందుకెళుతాడు.. ? ఎలాంటి ప్రతిఘటన ఇస్తాడన్నది వేచిచూడాలి..

సీజేపీ , బీజేపీ ఫైట్ మాత్రం తెరవెనుక మొదలైందని దీన్ని బట్టి అర్థమవుతోంది. సీజేపీ నేతల వ్యక్తిగత లూప్ హోల్స్ ను పడుతూ ముందుకెళ్లి వారిని జనాల్లో పలుచన చేసే ప్లాన్ ను బీజేపీ చేస్తున్నట్టుగా పరిణామాలను బట్టి అర్థమవుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి కాక్రోచ్ లు దీన్ని ఎలా ఎదుర్కొంటారన్నది వేచిచూడాలి.