Begin typing your search above and press return to search.

పార్లమెంట్ మీద దాడితో సమానమది !

అందుకే ఒక పార్లమెంట్ సభ్యుడి మీద జరిగిన దాడిని ఏకంగా పార్లమెంట్ మీద జరిగిన దాడితో హైకోర్టు పోల్చింది.

By:  Satya P   |   19 Jun 2026 8:45 AM IST
పార్లమెంట్ మీద దాడితో సమానమది !
X

పార్లమెంట్ అంటే కేవలం భవనం మాత్రమే కాదు, అక్కడ చట్టాలను తయారు చేస్తారు, అలా చట్ట సభ సభ్యులు ఉంటారు. దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్న మహాకవి గురజాడ వ్యాఖ్యల మాదిరిగానే పార్లమెంట్ ని చూసినపుడు సభ్యులు అత్యంత కీలకం అవుతారు. అందుకే ఒక పార్లమెంట్ సభ్యుడి మీద జరిగిన దాడిని ఏకంగా పార్లమెంట్ మీద జరిగిన దాడితో హైకోర్టు పోల్చింది. రెండింటికీ తేడా కూడా లేదు అంది. ఇదంతా ఒక కేసుకు సంబంధించిన విచారణ సందర్భంగా హైకోర్టు చేసిన కీలక కామెంట్స్ అన్న మాట.

రఘురామ కేసులో :

ఏపీ శాసనసభ ఉప సభాపతిగా ఉన్న రఘురామకృష్ణంరాజు గతంలో వైసీపీ ఎంపీగా ఉన్నపుడు ఎదుర్కొన్న కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించిన విచారణలో అనూహ్యమైన మలుపు చోటు చేసుకున్న సందర్భం ఇది. ఈ కేసులో నిందితుడుగా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ దాఖలు చేసిన ముందస్గ్తు బెయిల్ పిటిషన్ మీద ఏపీ హైకోర్టు విచారిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలోనే సమున్నతమైన పార్లమెంట్ మీద దాడికి పాల్పడిన దుండగులకు అదే పార్లమెంట్ లో మెంబర్ గా ఉన్న ఎంపీగా కస్టడీలోకి తీసుకుని థర్డ్ డిగ్రీతో హింసించిన వారికి మధ్య తేడా ఏముంది అని హైకోర్టు ప్రశ్నించడం గమనార్హం. ప్రజాస్వామిక దేశమిది, అందులో ఒక ఎంపీ మీద ఇలా చేయడం తీవ్రమైన నేరంగానే చూడాలని పేర్కొంది.

బాధ్యతాయుతమైన అధికారిగా :

ఇక ఈ విషయంలో బాధ్యతాయుతమైన ఐపీఎస్ అధికారిగా ఉన్న వారు విచక్షణతో వ్యవహరించాలని కూడా కోర్టు అభిప్రాయపడినిద్. కానీ రఘురామను కస్టడీకి తీసుకుని వేధించబోతున్నారు అన్నది ముందుగానే అందరికీ తెలిసిందని, మరి ఈ విషయంలో ప్రత్యక్షంగానా లేక పరోక్షంగానా అన్నది పక్కన పెడితే సునీల్ కుమార్ కీలకమైన పాత్ర పోషించినట్లుగా ప్రాధమిక ఆధారాలు ఉన్నాయని కూడా కోర్టు పేర్కొనడం విశేషం.

ఎపుడు సరెండర్ అవతారంటూ :

ఇక ఈ కేసులో సునీల్ కుమార్ కి ముందస్తు బెయిల్ ఇచ్చి రక్షణ కల్పించడం సాధ్యం కాదని కూడా కోర్టు తేల్చి చెప్పింది. అదే సమయంలో ఎపుడు సరెండర్ అవుతారని కూడా పిటిషనర్ తరఫున న్యాయవాదిని ఉద్దేశించి కోర్టు ప్రశ్నించింది. ఈ ముందస్తు పిటిషన్ ని ఇలాగే కొనసాగిస్తారా లేక చట్టాన్ని గౌరవించి సరెండర్ అవుతారా అని ప్రశ్నించింది. దాంతో ఈ కేసులో సునీల్ కుమార్ ఏమి చేస్తారు అన్నది ఇపుడు చర్చగా మారింది. అయితే ఈ కేసు విషయంలో తమ క్లయింట్ తో మాట్లాడి తదుపరి నిర్ణయం ఏమిటి అన్నది కోర్టు ముందు ఉంచుతామని సునీల్ కుమార్ న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో ఈ పిటిషన్ మీద ఎలాంటి తుది ఉత్తర్వులను కోర్టు జారీ చేయలేదు.