Begin typing your search above and press return to search.

విశాల్ దివాలా తీశారని ప్రకటిస్తారా? మద్రాస్ హైకోర్టు ప్రశ్న

ప్రఖ్యాత చిత్ర నిర్మాణ సంస్థ లైకాతో తమిళ నటుడు విశాల్ కు ఉన్న ఫైనాన్షియల్ పంచాయితీ కొంతకాలంగా కోర్టులో నలుగుతున్న సంగతి తెలిసిందే.

By:  Garuda Media   |   26 Nov 2025 3:37 PM IST
విశాల్ దివాలా తీశారని ప్రకటిస్తారా? మద్రాస్ హైకోర్టు ప్రశ్న
X

ప్రఖ్యాత చిత్ర నిర్మాణ సంస్థ లైకాతో తమిళ నటుడు విశాల్ కు ఉన్న ఫైనాన్షియల్ పంచాయితీ కొంతకాలంగా కోర్టులో నలుగుతున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి తాజాగా జరిగిన విచారణ వేళ.. మద్రాస్ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. అనంతరం ఆయనకు ఊరట కలిగించే నిర్ణయాన్ని ప్రకటించింది. లైకా సంస్థతో ఉన్న కేసు విచారణ సందర్భంగా విశాల్ తరఫు లాయర్ నోట మాట రాకుండా చేసిన న్యాయమూర్తి వ్యాఖ్యల్లోకి వెళితే..

కోర్టుకు సమర్పించిన పిటిషన్ లో తాను ధనవంతుడ్ని కాదని విశాల్ పేర్కొన్నారు. దీనిపై జోక్యం చేసుకున్న న్యాయమూర్తి విశాల్ ను దివాలా తీసిన వ్యక్తిగా ప్రకటించటానికి రెఢీగా ఉన్నారంటూ చేసిన వ్యాఖ్యలతో విశాల్ తరఫు లాయర్ నోట మాట రాని పరిస్థితి. ఇంతకూ ఈ కేసుకు సంబంధించిన వివరాల్ని చూస్తే.. విశాల్ తన ఫిలిమ్ ఫ్యాక్టరీ కోసం సినిమా ఫైనాన్షియర్ అన్బుచెళియన్కు చెందిన గోపురం ఫిలిమ్స్ నుంచి రూ.21.29 కోట్లు తీసుకున్నారు.

ఈ భారీ మొత్తాన్ని లైకా సంస్థ తీర్చింది. అదే సమయంలో తన అప్పును తీర్చిన లైకా సంస్థతో విశాల్ లో ఒక డీల్ కుదర్చుకున్నారు. తాను తీసుకున్న అప్పును తిరిగి చెల్లించే వరకు విశాల్ తన నిర్మాణ సంస్థకు చెందిన అన్నిసినిమాల హక్కులను లైకాకు ఇవ్వాలని డీల్ చేసుకున్నారు. అయితే.. ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ విశాల్ సినిమాలు విడుదల చేసినట్లుగా పేర్కొంటూ కేసు దాఖలు చేశారు.

దీంతో.. ఈ కేసును పరిశీలించిన మద్రాస్ హైకోర్టు సింగిల్ జడ్జి లైకా సంస్థకు రూ.21.29 కోట్లను 30 శాతం వడ్డీతో చెల్లించాలని విశాల్ ను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీన్ని సవాలు చేస్తూ విశాల్ ఆ తీర్పుపై స్టే ఇవ్వాలని కోరారు. 30 శాతం వడ్డీ అత్యధికమని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అందులో.. అత్యధిక వడ్డీని చెల్లించేంత ధనవంతుడు కాదని పేర్కొన్నారు.

కేసు విచారణ సందర్భంగా విశాల్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. లైకా సంస్థ పేర్కొన్నట్లుగా విశాల్ ధనవంతుడు కాదన్నారు. దీనికి స్పందించిన న్యాయమూర్తి.. ‘‘విశాల్ ను దివాలా తీసిన వ్యక్తిగా ప్రకటించటానికి సిద్ధంగా ఉన్నారా?’’ అని ప్రశ్నించారు. దీనికి బదులిస్తూ విశాల్ తరఫు న్యాయవాది. ‘‘30 శాతం వడ్డీ అత్యధికమని.. 30 శాతం వడ్డీతో తిరిగి చెల్లించాలని జారీ చేసిన ఉత్తర్వు చట్టవిరుద్దం. దానిపై స్టే ఇవ్వాలి’ అని కోరారు. కోర్టు చెప్పినట్లుగా చేస్తే.. వడ్డీ మాత్రమే రూ.40 కోట్లకు పైనే ఉంటుందని విశాల్ న్యాయవాదులు పేర్కొన్నారు.

దీనిపై మద్రాస్ హైకోర్టు ధర్మాసనం స్పందిస్తూ.. 30 శాతం వడ్డీ అత్యధికంగా పేర్కొంటూ.. ఇలా దోచుకోవటానికి తాము అనుమతించమన్నారు. అంతేకాదు.. రూ.21 కోట్ల రుణాన్ని 30 శాతం వడ్డీతో చెల్లించాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వుపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో.. విశాల్ కు ఒకింత ఊరట లభించిందని చెప్పాలి.