Begin typing your search above and press return to search.

నా ఇంట్లోకి ష‌ర్మిల‌ను అడుగు పెట్ట‌నివ్వ‌ద్దు: కోర్టులో జ‌గ‌న్ పిటిష‌న్‌

బెంగళూరులోని యలహంక ప్యాలెస్‌లోకి షర్మిల, ఆమె బంధువులను అనుమతించవద్దంటూ జగన్ దేవనహళ్లి కోర్టును ఆశ్రయించారు. సిలికాన్ బిల్డర్స్ లిమిటెడ్ పేరుతో దాఖలైన పిటిషన్‌లో ప్యాలెస్ తనకే చెందుతుందని పేర్కొన్నారు. కుమార్తె పెళ్లి కోసం అక్కడికి వెళ్లాలని షర్మిల భావిస్తున్న నేపథ్యంలో అన్నాచెల్లెళ్ల ఆస్తి వివాదం కోర్టుకు చేరింది.

By:  Garuda Media   |   22 Nov 2026 5:30 AM IST
నా ఇంట్లోకి ష‌ర్మిల‌ను అడుగు పెట్ట‌నివ్వ‌ద్దు:  కోర్టులో జ‌గ‌న్ పిటిష‌న్‌
X

వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. ఆయ‌న సోద‌రి ఏపీ కాంగ్రెస్ చీఫ్ ష‌ర్మిల మ‌ధ్య ఆస్తుల వివాదం కొత్త మ‌లుపు తిరిగింది.. ఇప్ప‌టి వ‌ర‌కు మాట‌ల దాడులు చేసుకున్న అన్నా చెల్లెళ్ల వ్య‌వ‌హారంలో జ‌గ‌న్ న్యాయ పోరాటం ప్రారంభించారు. బెంగ‌ళూరులోని య‌ల‌హంక ప్యాలెస్‌లోకి ష‌ర్మిల స‌హా.. ఆమె తాలూకు బంధువులు ఎవ‌రినీ అడుగు పెట్ట‌నివ్వ‌కుండా ఆదేశాలు జారీ చేయాల‌నికోరుతూ.. కోర్టును ఆశ్ర‌యించారు.. బెంగ‌ళూరు తాలూకాలోని దేవ‌న‌హ‌ళ్లి స్థానిక కోర్టులో సిలికాన్ బిల్డ‌ర్స్ లిమిటెడ్ పేరుతో ఈ పిటిష‌న్ వేయ‌డం గ‌మ‌నార్హం. ఈ పిటిష‌న్‌లో జ‌గ‌న్‌.. య‌లహంక ప్యాలెస్ త‌నదేన‌ని.. ఇది పూర్తిగా త‌న‌కు మాత్ర‌మే చెందుతుంద‌ని పేర్కొన్నారు.

కానీ, కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్య‌క్షురాలి హోదాలో ఉన్న ష‌ర్మిల‌.. త‌న వారితో క‌లిసి ఈ ప్యాలెస్ లో కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించేందుకు ప్ర‌ణాళిక సిద్ధం చేస్తున్నార‌ని తెలిపారు. ఇది త‌న‌కు, త‌న కుటుంబానికి కూడా ఇబ్బందిక‌ర ప‌రిణామ‌మ‌ని జ‌గ‌న్ పేర్కొన్నారు. ఈ విష‌యాన్ని గ‌తంలోనే ఆమెకు తెలియ‌జేస్తూ.. తాను బ‌హిరంగ లేఖ రాసిన విష‌యాన్ని పిటిష‌న్‌లో వివ‌రించారు. స‌ద‌రు లేఖ‌ను కూడా ఈ పిటిష‌న్‌కు జ‌త ప‌రిచిన‌ట్టు జ‌గ‌న్ త‌ర‌ఫు న్యాయవాది పేర్కొన్నారు. అయితే.. ఈ పిటిష‌న్‌పై విచార‌ణ జ‌ర‌గాల్సి ఉంద‌న్నారు. కానీ, త‌క్ష‌ణ ఉత్త‌ర్వుల కోసం హౌస్ మోష‌న్ పిటిష‌న్ వేసిన‌ట్టు తెలిపారు.

ఇది లావుంటే, ఆదివారం త‌న కుమార్తె పెళ్లి ప‌నుల‌పై య‌ల‌హంక ప్యాలెస్‌కు వెళ్లేందుకు ష‌ర్మిల రెడీ అయ్యారు. తన‌తోపాటు త‌న భ‌ర్త‌, కుమారుడు, కోడ‌లు కూడా ఈ ప్యాలెస్‌కు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలిసింది. ఈ విష‌యం తెలిసిన జ‌గ‌న్‌.. త‌న చెల్లెలు స‌హా.. ఎవ‌రినీ ఆ ప్యాలెస్‌లో అడుగు పెట్ట‌కుండా అడ్డుకోవాల‌ని, ఆమేర‌కు ఆదేశాలు ఇవ్వాల‌ని కోరుతూ.. కోర్టును ఆశ్ర‌యించ‌డం గ‌మ‌నార్హం. గ‌త నెల రోజుల నుంచి ఈ ప్యాలెస్ వ్య‌వ‌హారంపై ఇరువురి మ‌ధ్య వివాదం న‌డుస్తోంది. ఇక్క‌డే త‌న కుమార్తె వివాహం చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు ష‌ర్మిల తెలిపారు. చిన్న‌ప్ప‌టి నుంచి త‌న కుమార్తె అంజ‌లి ఇక్క‌డే పుట్టి పెరిగార‌ని.. కాబ‌ట్టి త‌న కోరిక‌ను నెర‌వేర్చాల్సిన బాధ్య‌త త‌న‌కు ఉంద‌న్నారు.

కానీ, జ‌గ‌న్ మాత్రం.. త‌న‌కు, త‌న కుటుంబానికి భ‌ద్ర‌తా ప‌ర‌మైన స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో ఇక్క‌డ‌కు ఎవ‌రినీ అనుమ‌తించ‌లేన‌ని, వివాహానికి అవ‌స‌ర‌మైతే.. హైద‌రాబాద్‌లోని ప్యాలెస్‌ను వాడుకోవాల‌ని కోరారు. ఈ మేర‌కు త‌న ఇబ్బందులు చెబుతూ ఆయ‌న సోద‌రికి గ‌త నెల‌లోనే సుదీర్ఘ లేఖ రాశారు. ''ఎవ‌రెవ‌రో వ‌స్తారు. వారివ‌ల్ల మాకు ముఖ్యంగా నాకు హాని జ‌రిగే ప్ర‌మాదం ఉంది'' అని లేఖ‌లో వివ‌రించిన విష‌యం తెలిసిందే. కాగా.. ఈ వివాదంపై ఇరువురి మాతృమూర్తి విజ‌య‌మ్మ ఇప్ప‌టి వ‌రకు స్పందించ‌లేదు. అయితే.. ఈ ఏడాది మార్చిలో ఇచ్చిన నోట‌రీ అఫిడ‌విట్‌లో మాత్రం య‌ల‌హంక ప్యాలెస్ భూమి ష‌ర్మిల‌దేన‌ని ఆమె పేర్కొన్నారు. తాజా వివాదంపై మాత్రం ఆమె స్పందించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.