Begin typing your search above and press return to search.

రూ.215 కోట్ల కేసులో నటికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ.. అసలేమైందంటే?

ఈ హీరోయిన్ తెలుగులో పలు సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేసింది.అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మకి తాజాగా సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది.

By:  Madhu Reddy   |   22 Sept 2025 3:58 PM IST
రూ.215 కోట్ల కేసులో నటికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ.. అసలేమైందంటే?
X

బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ అంటే టాలీవుడ్ లో కూడా సుపరిచితమే. ఈ హీరోయిన్ తెలుగులో పలు సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేసింది.అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మకి తాజాగా సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తాజాగా సుప్రీంకోర్టుకు వెళ్లి తనపై ఉన్న ఈడీ కేసుని కొట్టివేయాలని పిటిషన్ చేసింది. సోమవారం అనగా సెప్టెంబర్ 22న జస్టిస్ దీపాంకర్ దత్త, అగస్టిన్ జార్జ్ మాసిహ్ లతో కూడిన ధర్మాసనం ఈమె వేసిన పిటిషన్ ను విచారించగా.. ఈమె పిటిషన్ ను రద్దు చేస్తూ ఈమెకు షాక్ ఇచ్చింది సుప్రీం కోర్ట్.

మనీ లాండరింగ్ ఇష్యూ విషయం గురించి చూసుకుంటే.. ఆర్థిక నేరగాడు సుఖేష్ చంద్రశేఖర్ ప్రస్తుతం రూ.250 కోట్ల కుంభకోణంలో ఇరుక్కుని జైలు జీవితం గడుపుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ కుంభకోణంతో నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హస్తం కూడా ఉన్నట్లు వార్తలు వినిపించాయి. దానికి కారణం సుఖేష్ చంద్రశేఖర్ గురించి జాక్వెలిన్ కి పూర్తి వివరాలు ముందే తెలుసట. దోపిడీదారు అనే విషయం తెలిసి కూడా సుఖేష్ చంద్రశేఖర్ తో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ సన్నిహితంగా ఉంది.

అంతేకాదు సుఖేష్ చంద్రశేఖర్ దోపిడీ చేసిన డబ్బుల నుండి కొంత వరకు జాక్వెలిన్ కి కూడా అందాయి అని అయితే అవి డబ్బు రూపంలో కాకుండా బహుమతుల రూపంలో అందాయి. అలా జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కి సుకేష్ చంద్రశేఖర్ వజ్రాల కమ్మలు, కోట్ల విలువచేసే డిజైనర్ బ్యాగులు, బ్రేస్ లేట్, జిమ్ సూట్లు, మినీ కూపర్ వంటి ఎన్నో విలువైన బహుమతులు ఇచ్చారు. అయితే చంద్రశేఖర్ నుండి జాక్వెలిన్,ఆమె కుటుంబానికి ఇప్పటి వరకు దాదాపు 10 కోట్ల విలువ చేసే బహుమతులు అందినట్టు తెలుస్తోంది. దాంతో సుకేష్ చంద్రశేఖర్ ఇరుక్కున్న కుంభకోణంలో జాక్వెలిన్ హస్తం కూడా ఉన్నట్టు ఈడి అధికారులు తేల్చేశారు.

దాంతో ఇప్పటికే ఈడి అధికారులు జాక్వెలిన్ ని కూడా విచారించారు. అయితే తన మీద ఉన్న ఈ రూ.215 కోట్ల కేసుని కొట్టివేయాలని సుప్రీంకోర్టుని జాక్వెలిన్ ఆశ్రయించగా.. దీనిపై విచారణ జరిపినటువంటి సర్వోన్నత న్యాయస్థానం హీరోయిన్ కి షాక్ ఇచ్చింది. జాక్వెలిన్ మీద ఉన్న కేసుని కొట్టి పారేయలేం అంటూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది దాంతో సుప్రీంకోర్టులో జాక్వెలిన్ కి ఎదురు దెబ్బ తగిలింది.. ఇక సుకేష్ చంద్రశేఖర్ జైల్లో ఉంటూనే జైలు నుండి ఎన్నో ప్రేమ లేఖలు జాక్వెలిన్ కి పంపారు.. ఈడి అధికారులు కూడా గుర్తించిన విషయం తెలిసిందే. మొత్తానికి అయితే ఈ కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఈమెకు అక్కడ కూడా ఎదురుదెబ్బ తగిలింది అని చెప్పవచ్చు.