Begin typing your search above and press return to search.

కోర్టు విచారణ ఫొటోలు, వీడియోలు వైరల్ చేస్తే అంతే సంగతలు.. హైకోర్టు కీలక ఆదేశాలు

హైకోర్టు విచారణలను అనుమతి లేకుండా రికార్డు చేయడం, లైవ్ ప్రసారం చేయడం, స్క్రీన్‌షాట్లు తీయడం నిషేధిస్తూ రిజిస్ట్రార్ డి. ఏడుకొండలు ఆదేశాలు జారీ చేశారు. రికార్డు చేసిన దృశ్యాలు, ఫొటోలను టీవీ ఛానళ్లు, సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్‌లలో షేర్ చేయకూడదని స్పష్టం చేశారు. ఈ నిబంధనలు మీడియాతో పాటు న్యాయవాదులు, కక్షిదారులు, సందర్శకులందరికీ వర్తిస్తాయి.

By:  Tupaki Political Desk   |   25 Nov 2026 3:39 PM IST
కోర్టు విచారణ ఫొటోలు, వీడియోలు వైరల్ చేస్తే అంతే సంగతలు.. హైకోర్టు కీలక ఆదేశాలు
X

కోర్టు విచారణల రికార్డింగ్, ప్రసారంపై ఉన్నత న్యాయస్థానం కఠిన ఆంక్షలు విధించింది. కోర్టు కార్యకలాపాలను అనధికారికంగా రికార్డు చేయడం, లైవ్ ఇవ్వడం లేదా స్క్రీన్ షాట్లు తీసి వైరల్ చేయడం వంటి చర్యలను పూర్తిగా నిషేధిస్తున్నట్లు హైకోర్టు రిజిస్ట్రార్ డి.ఏడుకొండలు స్పష్టం చేశారు. న్యాయస్థాన గౌరవం, పవిత్రత, క్రమబద్ధమైన నిర్వహణతో పాటు న్యాయ పరిపాలన సజావుగా సాగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.

హైకోర్టులో ప్రత్యక్షంగా జరిగే విచారణలతో పాటు, వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా నిర్వహించే విచారణలను సంబంధిత అధికారి ముందస్తు అనుమతి లేకుండా ఏ రూపంలోనూ రికార్డు చేయకూడదని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలు, హైకోర్టు అధికారిక వెబ్‌సైట్‌లోని వీడియో కాన్ఫరెన్సు నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. కేవలం విచారణకు హాజరైనంత మాత్రాన లేదా ఆన్‌లైన్‌లో వీక్షించినంత మాత్రాన ఆ దృశ్యాలను రికార్డు చేసి ఇతరులకు పంపే హక్కు ఎవరికీ లభించదని హైకోర్టు తేల్చిచెప్పింది.

ఈ ఆదేశాల ప్రకారం న్యాయస్థాన వార్తలను కవర్ చేసే సమయంలో టెలివిజన్ ఛానళ్లు, వెబ్‌సైట్లు, సోషల్ మీడియా నిర్వాహకులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాల్సి వుంటుందని అంటున్నారు. సంబంధిత అధికారి నుండి ప్రత్యేక అనుమతి పొందితే తప్ప, కోర్టు విచారణలకు సంబంధించిన ఆడియో, వీడియోలను రికార్డు చేయడం గానీ, ప్రత్యక్ష విచారణల ఫొటోలు తీయడం గానీ చేయకూడదని చెబుతున్నారు. ముఖ్యంగా వీడియో కాన్ఫరెన్స్ విచారణ సమయంలో స్క్రీన్ షాట్లు తీయడం, స్క్రీన్ రికార్డింగ్ చేయడం పూర్తిగా నిషిద్ధమని హైకోర్టు స్పష్టం చేసింది.

అనుమతి లేకుండా రికార్డు చేసిన దృశ్యాలను టీవీ ఛానళ్లలో ప్రసారం చేయడం, వెబ్‌సైట్లు, యూట్యూబ్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేయడం లేదా లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వకూడదని తేల్చిచెప్పింది. అంతేకాకుండా, వాట్సాప్, టెలిగ్రామ్ వంటి మెసేజింగ్ యాప్‌ల ద్వారా కోర్టు విచారణల క్లిప్పింగ్‌లను లేదా ఫొటోలను ఇతరులకు షేర్ చేయడం, చలామణి చేయడం కూడా తీవ్రమైన ఉల్లంఘన కిందకే వస్తుంది. ఈ నిబంధనలు కేవలం మీడియా ప్రతినిధులకే కాకుండా న్యాయవాదులు, కక్షిదారులు, కేసులోని పక్షాలు, కోర్టు సిబ్బంది, సందర్శకులకు కూడా సమానంగా వర్తిస్తాయి.

న్యాయస్థాన వార్తలను కవర్ చేసే సమయంలో టెలివిజన్ ఛానళ్లు, వెబ్‌సైట్లు, సోషల్ మీడియా నిర్వాహకులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలి. సంబంధిత అధికారి నుండి ప్రత్యేక అనుమతి పొందితే తప్ప, కోర్టు విచారణలకు సంబంధించిన ఆడియో, వీడియోలను రికార్డు చేయడం గానీ, ప్రత్యక్ష విచారణల ఫొటోలు తీయడం గానీ చేయకూడదు. ముఖ్యంగా వీడియో కాన్ఫరెన్సింగ్ విచారణల సమయంలో స్క్రీన్ షాట్లు తీయడం, స్క్రీన్ రికార్డింగ్ చేయడం పూర్తిగా నిషిద్ధం. అనుమతి లేకుండా రికార్డు చేసిన దృశ్యాలను టీవీ ఛానళ్లలో ప్రసారం చేయడం, వెబ్‌సైట్లు, యూట్యూబ్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేయడం లేదా లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వకూడదు. అంతేకాకుండా, వాట్సాప్, టెలిగ్రామ్ వంటి మెసేజింగ్ యాప్‌ల ద్వారా కోర్టు విచారణల క్లిప్పింగ్‌లను లేదా ఫొటోలను ఇతరులకు షేర్ చేయడం, చలామణి చేయడం కూడా తీవ్రమైన ఉల్లంఘన కిందకే వస్తుంది. ఈ నిబంధనలు కేవలం మీడియా ప్రతినిధులకే కాకుండా న్యాయవాదులు, కక్షిదారులు, కేసులోని పక్షాలు, కోర్టు సిబ్బంది, సందర్శకులకు కూడా సమానంగా వర్తిస్తాయి.