4 వారాలే గడువు: ఏపీ మండలి చైర్మన్‌కు హైకోర్టు ఆదేశం
ఏపీ శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజును ఉద్దేశించి రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
By: Garuda Media | 27 Nov 2025 12:33 PM ISTఏపీ శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజును ఉద్దేశించి రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక చైర్మ న్‌గా బాధ్యతలు గుర్తుంచుకోవాలని సూచించింది. ఎవరోగుర్తు చేసే పరిస్థితి తెచ్చుకోవద్దని వ్యాఖ్యానించింది. నాలుగు వారాల్లోగా సమస్యను పరిష్కరించాలని ఆదేశించింది. ఈ మేరకు తాజాగా గురువారం జరిగిన విచారణలో మండలి చైర్మన్‌ను ఉద్దేశించి హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
విషయం ఇదీ..
వైసీపీ తరఫు మండలికి ఎన్నికైన ఉమ్మడి కృష్నాజిల్లాకు చెందిన జయ మంగళ వెంకట రమణ గత ఏడా ది వైసీపీకి రాజీనామా చేశారు. అనంతరం.. ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలో తన శాస న మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను చైర్మన్‌కు అందించారు. అయితే.. ఇది జరిగి నెలలు గడిచినా.. చైర్మన్ ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. వాస్తవానికి వైసీపీ నుంచి బయటకు వచ్చిన మండలి సభ్యుల రాజీనామాలు ఏవీ కూడా ఆమోదించలేదు.
అయితే.. జయ మంగళ వెంకటరమణ హైకోర్టును ఆశ్రయించారు. తన రాజీనామాపై మండలి చైర్మన్ నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలని కోరారు. దీనిపై గతంలోనే విచారణ జరిపిన హైకోర్టు.. చైర్మన్‌ను వివరణ కోరింది. దీనికి చైర్మన్ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. దీంతో మరోసారి జయమంగళ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై గురువారం జరిగిన విచారణలో హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో మండలి చైర్మన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసింది.
ఇన్నాళ్లయినా ఎందుకు నిర్ణయం తీసుకోలేక పోయారని చైర్మన్ మోషేన్ రాజును ఉద్దేశించి ప్రశ్నించిన హైకోర్టు.. బాధ్యతలను గుర్తెరగాలని సూచించింది. ఎవరో వచ్చి బాధ్యతలు గుర్తు చేసే పరిస్థితి తెచ్చుకోవ ద్దని తెలిపింది. అదేసమయంలో 4 వారాల్లో జయమంగళ రాజీనామాపై చర్యలు తీసుకుని.. సంబంధిత సమాచారాన్ని ఆయనకు తెలియజేయాలని ఆదేశించింది. మండలి చైర్మన్‌గా బాధ్యతగా వ్యవహరించా లని సూచించింది.
