అరెస్ట్ అయితే చాలు.. ఇక 'ఉద్యోగానికి' సెలవు.. సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పుతో అవినీతి తిమింగలాలకు వణుకు
ప్రభుత్వ ఉద్యోగి ఏదైనా కేసులో అరెస్టై 48 గంటలకు మించి జ్యుడీషియల్ కస్టడీలో ఉంటే ఆటోమేటిక్‌గా సస్పెండ్ అయినట్లేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం లేదని జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మన్మోహన్‌ల ధర్మాసనం తేల్చిచెప్పింది. బిహార్‌లోని విశ్వజిత్ సింగ్ కేసు విచారణ సందర్భంగా ఈ కీలక స్పష్టత ఇచ్చింది.
By: A.N.Kumar | 10 Nov 2026 11:30 AM ISTలంచం కేసులో అధికారి అరెస్ట్.. అవినీతి తిమింగళం అంటూ ఆ అధికారి కొల్లగొట్టిన డబ్బుల కట్టలతో మనం పెద్ద పెద్ద వార్తలు వేస్తుంటాం.. కానీ వారు తీరికగా అరెస్ట్ అయ్యి ఆ తర్వాత ఆధారాలు లేవనో.. లేక ఏదైనా లూప్ హోల్ ను ఉపయోగించుకొని.. సాక్ష్యులను ప్రభావితం చేసో ఆరు నెలల్లోనే మళ్లీ పదవుల్లోకి వస్తుంటారు. సో అధికారులు లంచంలో దొరకడం ఖాయం.. వారు అరెస్ట్ అవ్వడం ఖాయం.. కానీ ఇన్ఫ్ల్యూయేన్స్ తో మళ్లీ బయటకు వచ్చేస్తుండడం అత్యంత సహజంగా జరుగుతున్న ప్రక్రియ.. అందుకే జనాల్లో లంచావతరాల మీద ఆసక్తి నమ్మకం పోతోంది.
ప్రభుత్వ ఉద్యోగం అంటే జీవితానికి భద్రత.. ఏ తప్పు చేసినా ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదనే ఒక అపోహ చాలా మందిలో ఉంటుంది. ఎందుకంటే లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయినా.. ఆ తర్వాత కాస్త హడావుడి చేసి.. లూప్‌హోల్స్ వెతికి, సాక్ష్యాలను మేనేజ్ చేసి ఆరు నెలల్లోనే మళ్లీ పాత కుర్చీలో కూర్చోవడం మన దగ్గర సర్వసాధారణం. అందుకే అవినీతి అధికారుల లీలలు చూసి విసిగిపోయిన సామాన్యులకు వ్యవస్థ మీద ఉన్న నమ్మకం కూడా క్రమంగా సన్నగిల్లుతోంది. అయితే ఇకపై ఆ డ్రామాలకు తెరదించుతూ సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన ఓ తీర్పు అవినీతి అధికారులకు గట్టి మేలుకొలుపుగా మారింది.
ఒక ప్రభుత్వ ఉద్యోగి ఏదైనా కేసులో అరెస్టయి 48 గంటలకు మించి జ్యుడీషియల్ కస్టడీలో ఉంటే చాలు.. అతను ఆటోమేటిక్‌గా సస్పెండ్ అయినట్లేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం కూడా లేదని తేల్చిచెప్పింది. జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మన్మోహన్‌ల ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. బిహార్‌లోని సమస్తిపూర్ సదర్ ఆసుపత్రి అడ్మినిస్ట్రేటర్ విశ్వజిత్ సింగ్ కేసు విచారణ సందర్భంగా సర్వీసు నిబంధనలపై ఈ స్పష్టత ఇచ్చింది.
ఇన్నాళ్లూ అవినీతి అధికారులు అరెస్టయినా.. సస్పెన్షన్ ఉత్తర్వులు రావడానికి రోజుల తరబడి కాలయాపన జరిగేది. ఆ లోపు పలువురు పైస్థాయి సిఫార్సులతో మళ్లీ విధుల్లోకి వచ్చేసేవారు. కానీ తాజా తీర్పు ప్రకారం 48 గంటల లాకప్ లేదా జైలు ఊచలు లెక్కలోకి వస్తాయే తప్ప.. పైస్థాయి ఒత్తిళ్లు పనిచేయవు. అయితే ఈ సస్పెన్షన్ అంటే ఉద్యోగం శాశ్వతంగా ఊడిపోయినట్లు కాదులేండి.. కేవలం సర్వీసు నిబంధనల ప్రకారం అదొక తాత్కాలిక పరిపాలనా చర్య మాత్రమే.
మాపై ఎవరి అజమాయిషీ లేదు అనుకుంటూ రెచ్చిపోయే ప్రభుత్వ ఉద్యోగులకు సుప్రీంకోర్టు ఈ తీర్పుతో గట్టిగానే బ్రేకులు వేసింది.
