Begin typing your search above and press return to search.

'నిందితులకు సలహా ఇచ్చే లాయర్లకు సమన్లు ఇచ్చే అధికారం లేదు'

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్.. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని విబేదాలపై ఆయన చిరాగ్గా ఉన్నట్లుగా తెలుస్తోంది.

By:  Garuda Media   |   1 Nov 2025 9:50 AM IST
నిందితులకు సలహా ఇచ్చే లాయర్లకు సమన్లు ఇచ్చే అధికారం లేదు
X

కీలక తీర్పు ఒకటి దేశ అత్యున్నత న్యాయస్థానం వెలువరించింది. క్రిమినల్ కేసుల్లో నిందితులకు న్యాయ సలహా ఇచ్చిన లాయర్లకు ఏకపక్షంగా సమన్లు జారీ చేసే అధికారం దర్యాప్తు సంస్థలకు కానీ దర్యాప్తు అధికారికి కానీ లేదన్న విషయాన్ని తాజాగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సీనియర్ న్యాయవాదులకు ఈడీ (ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) సమన్లు జారీ చేసిన అంశంపై చెలరేగిన వివాదానికి తన తాజా తీర్పుతో ఫుల్ స్టాప్ పెట్టింది.

ఈ వివాదానికి సంబంధించిన వ్యాజ్యాన్ని సుమోటోగా తీసుకున్న అత్యున్నత న్యాయస్థానం.. ఈ కేసును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ నేత్రత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తీర్పును వెలువరించింది. ఈ సందర్భంగా న్యాయవాది - కక్షిదారు మధ్య జరిగే సంభాషణను కాపాడుతూ.. సమన్ల జారీ అంశంపై దిశానిర్దేశం చేసింది. అంతేకాదు న్యాయవాది - కక్షిదారు మధ్య సంబంధాన్ని స్పష్టంగా నిర్వచించిన చట్ట నిబంధనను ఈ సందర్భంగా ప్రస్తావించింది.

భారతీయ సాక్ష్య అధినియమ్ లోని సెక్షన్ 132 ప్రకారం నిందితుడితో జరిగే సంభాషణను రహస్యంగా ఉంచే హక్కు న్యాయవాదులకు ఉందని స్పష్టం చేసింది. అయితే.. సెక్షన్ 132లో పేర్కొన్న మినహాయింపుల కింద వచ్చే అంశాలకు మాత్రం సమన్లు జారీచేసే వీలుందని పేర్కొంది.

అయితే.. మినహాయింపుల్లోని ఏ నిబంధన ద్వారా సమన్లు జారీ చేస్తున్నారో ఆ విసయాన్ని స్పష్టం చేయాలని చెప్పింది. అంతేకాదు.. ఎస్పీ స్థాయి అధికారి నుంచి అంగీకారం తీసుకున్న తర్వాతే సమన్లు జారీ చేసే వీలుందని స్పష్టం చేసింది. అంతేకాదు.. విచారణ అధికారి పేర్కొన్న మినహాయింపుపై తాను సంత్రప్తి చెందుతున్నట్లుగా రాతపూర్వకంగా ఇస్తేనే సమన్లు జారీ చేయాల్సి ఉంటుందని సుప్రీం పేర్కొంది.