కాలిపోతున్న శవం.. బట్టలపై వీర్యం.. సంభాల్ గ్యాంగ్ రేప్ తీర్పు ఇదే!
ఏమి జరిగిందో తెలియని ఆ బాలికకు.. ఏడుపు కూడా తెలియకుండానే దారాళంగా కంటినుంచి కన్నీరు రూపంతో ఉబికి ఉబికి వస్తుంది! మనుషుల్లో అదీ ఒక జాతి అని ఆమెకు తెలియదు కదా!
By: Raja Ch | 20 Dec 2025 5:54 PM ISTఅది జూలై 13, 2018. ఉత్తరప్రదేశ్ లోని సంభాల్ జిల్లాలోని రాజ్ పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని పాఠక్ పూర్ గ్రామంలోని ఓ చిన్న ఇల్లు. ఆ ఇంటి యజమాని ఢిల్లీలో కూలిగా పని చేస్తున్నాడు. ఆయన భార్య, ఏడేళ్ల కూతురు ఇంట్లోనే ఉన్నారు. అయితే అది అన్ని రాత్రుల లానే గడుస్తుంది, ఉదయం తెల్లారుతుందని ఆ తల్లీకూతుళ్లు భావించారు. కానీ అది వారి జీవితంలో కాళరాత్రిగా మారింది. ఆ సమయంలో రాక్షసుల లాంటి ఐదుగురు మనుషులు ఆ ఇంట్లోకి చొరబడ్డారు.
కామంతో కళ్లు మూసుకుపోయి.. తమకు, పురాణాల్లోని రాక్షసులకూ ఏమాత్రం తేడా లేదన్నట్లుగా ఆ ఇంట్లోకి చొరబడి.. ఆ అమాయక బాలిక ముందే ఆ మహిళపై సామూహిక అత్యచారం చేశారు. అనంతరం ఆమెను బెదిరించిన నిందితులు, అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఏమి జరిగిందో తెలియని ఆ బాలికకు.. ఏడుపు కూడా తెలియకుండానే దారాళంగా కంటినుంచి కన్నీరు రూపంతో ఉబికి ఉబికి వస్తుంది! మనుషుల్లో అదీ ఒక జాతి అని ఆమెకు తెలియదు కదా!
మరోవైపు బాధను పంటి కింద పెట్టుకున్న ఆ మహిళ, తన బంధువుకు ఫోన్ చేసి, తన బాధను కన్నీళ్లతో వివరించింది.. ఇదే సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడిన వారిలోని ప్రధాన నిందితుడి పేరు చెప్పింది. ఇంతలోనే ఆ నిందితుడు మళ్లీ వచ్చాడు. ఆమె ఫోన్ లో చెప్పిన విషయాన్ని విన్నాడో ఏమో.. ఆమెను సమీపంలోని ఆలయంలో ఉన్న అగ్నిగుండం వద్దకు లాగి, ఆమెను సజీవ దహనం చేశాడు. తాను మనిషిని అనే విషయం మరిచినట్లున్నాడు!
దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ కేసును ఉత్తరప్రదేశ్ లోని సంభాల్ జిల్లాలోగల పోక్సో కోర్టు విచారణ జరిపింది. ఈ విచారణలో ప్రధానంగా మూడు ఆధారాలను పరిగణలోకి తీసుకున్నట్లుంది. ఇవే ఈ కేసులో న్యాయాన్ని బ్రతికించాయని అంటున్నారు. ఇందులో భాగంగా... తన తల్లిని దహనం చేయడాన్ని చూసిన ఏడేళ్ల కుమార్తె ప్రత్యక్ష సాక్షిగా వాంగ్మూలం ఇచ్చింది! ఈ కేసులో ఇదే అత్యంత కీలకంగా మారిందన్ని చెబుతున్నారు.
ఇక రెండోది.. బాధిత మహిళ తన బంధువుకు సహాయం కోసం వేడుకున్నప్పటికి ఆడియో రికార్డింగ్ కాగా.. మూడోది.. నిందితుడి దుస్తులపై వీర్యం జాడలను వెల్లడించిన ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక అని అంటున్నారు. ఈ కీలక ఆధారాలు.. ఇది తప్పుడు కేసు అనే వాదనలను పూర్తిగా తోసిపుచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా పోక్సో కోర్టు ఈ దారుణ నేరంపై చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఇందులో నిందితులకు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించినట్లు చెప్పింది.
ఇందులో భాగంగా... సామూహికా అత్యాచారం, హత్యకు పాల్పడిన ఆరామ్ సింగ్, మహావీర్, జైవీర్ అలియాస్ గుల్లు, భోనా అలియాస్ కున్వర్ పాల్ లకు ప్రత్యేక న్యాయమూర్తి అవధేష్ కుమార్ సింగ్ జీవిత ఖైదు విధించారు. నిందితులపై ఒక్కొక్కరికీ రూ.1,12,000 జరిమానా కూడా విధించారు. నిందితుల్లో ఒకరు మైనర్ అవ్వడంతో అతని కేసును విడిగా ప్రాసెస్ చేస్తున్నారు.
