Begin typing your search above and press return to search.

ఢిల్లీ హైకోర్టులో ఏ.ఆర్.రెహమాన్ కు భారీ ఊరట..ఏమైందంటే?

తాజాగా ఏఆర్ రెహమాన్ కి హైకోర్టులో ఊరట లభించింది.గత కొద్ది రోజులుగా ఆయన ఓ సినిమాలోని పాట విషయంలో కాపీరైట్ ఆరోపణలు ఎదుర్కొన్నారు.

By:  Madhu Reddy   |   24 Sept 2025 2:19 PM IST
ఢిల్లీ హైకోర్టులో ఏ.ఆర్.రెహమాన్ కు భారీ ఊరట..ఏమైందంటే?
X

తాజాగా ఏఆర్ రెహమాన్ కి హైకోర్టులో ఊరట లభించింది.గత కొద్ది రోజులుగా ఆయన ఓ సినిమాలోని పాట విషయంలో కాపీరైట్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. తమ మామ,తండ్రి కలిపి చేసిన మ్యూజిక్ ని ఏఆర్ రెహమాన్ కాపీ చేశారు అంటూ ఓ సింగర్ ఏఆర్ రెహమాన్ పై కాపీ రైట్ ఆరోపణ చేశారు. అయితే ఆ వ్యక్తి చేసిన కాపీరైట్ ఆరోపణలను విచారించిన కోర్టు మ్యూజిక్ డైరెక్టర్ ఏ. ఆర్. రెహమాన్ పై అలాగే సినిమా నిర్మాణ సంస్థపై రూ. 2 కోట్ల జరిమానా విధించడంతో పాటు ఆ సినిమాలోని పాట క్రెడిట్ ని పిటిషన్ దారుడికి ఇవ్వాలి అని తీర్పు ఇచ్చింది. కానీ ఈ తీర్పును సవాల్ చేస్తూ ఏఆర్ రెహమాన్ పిటిషన్ దాఖలు చేశారు.

దానికి సంబంధించి ఈరోజు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరపగా ఏ.ఆర్ రెహమాన్ కి ఊరట కలిగించే తీర్పు లభించింది. విషయంలోకి వెళ్తే.. మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్,ఐశ్వర్యరాయ్ త్రిష,రవి మోహన్,కార్తీ, ఐశ్వర్య మీనన్ లు నటించిన 'పొన్నియిన్ సెల్వన్' సినిమా. ఈ సినిమా పొన్నియన్ సెల్వన్ 1,2 అంటూ రెండు భాగాలుగా విడుదలయ్యాయి. అయితే పొన్నియిన్ సెల్వన్ సినిమాకి ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందించగా.. పొన్నియిన్ సెల్వన్ 2 లోని "వీర రాజ వీర" అనే పాట పై కాపీరైట్ ఆరోపణలు వచ్చాయి..

సింగర్ ఉస్తాద్ ఫయాజ్ వసిపుదీన్ డగర్ పొన్నియన్ సెల్వన్ 2 లోని వీర రాజ వీర పాట కాపీ చేశారనే ఆరోపణలు చేశారు. ఆ పాట మా మామ జహిరుదీన్ డగర్, నా తండ్రి ఫయజుదీన్ డగర్ లు కలిసి సంగీతం అందించిన "శివస్తుతి" పాట నుండి కాపీ చేశారు అంటూ ఏఆర్ రెహమాన్ పై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఆయన దాఖలు చేసిన పిటిషన్ ని విచారించి సినిమా నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్ పై, ఏ ఆర్ రెహమాన్ పై రెండు కోట్ల జరిమానా విధించడంతో పాటు వీర రాజ వీర పాట క్రెడిట్ ఉస్తాద్ ఫయాజ్ కి ఇవ్వాలని తీర్పు ఇచ్చింది.

కానీ ఈ తీర్పుని రెహమాన్ సవాల్ చేసి మళ్లీ పిటిషన్ వేయగా.. తాజాగా ఢిల్లీ హైకోర్టు

శివస్తుతి పాటని కాపీ చేశారని ఉస్తాద్ ఫయాజ్ వేసిన పిటిషన్ ని కొట్టిపారేసి.. ఆ పాట కాపీ కాదు అని తీర్పు ఇచ్చారు. అంతేకాకుండా రెహమాన్ అభ్యర్థనను పరిగణలోకి తీసుకొని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును పక్కన పెడుతున్నట్లు జస్టిస్ ఓం ప్రకాష్ శుక్లా, జస్టిస్ హరిశంకర్ లు తీర్పు ఇచ్చారు. దీంతో ఏ.ఆర్. రెహమాన్ కి హైకోర్టులో భారీ ఊరట లభించింది.