రాష్ట్రంలో వర్షాలు.. హైకోర్టులో సునామీనా?!
పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు ఈనెల 12న ఉప ఎన్నికల పోలింగ్ నిర్వహించారు. దీనిపై వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది.
By: Garuda Media | 14 Aug 2025 4:08 PM ISTఏపీ హైకోర్టులో టీడీపీ వర్సెస్ వైసీపీ న్యాయవాదుల మధ్య హోరా హోరీ వాదనలు జరిగాయి. దీంతో న్యా యమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా వర్షా లు కురుస్తుంటే.. హైకోర్టులో సునామీ సృష్టిస్తున్నారే! అని అన్నారు. దీనికి కారణం.. ఇరు పక్షాలు కూడా.. పులి వెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలపై భారీ ఎత్తున వాద ప్రతివాదనలు వినిపించడమే. ఒకానొక దశలో హైకోర్టు మొత్తం సైలెంట్ అయిపోయింది. అయితే.. దీనిపై స్పందించిన న్యాయమూర్తి.. వాదనల జోరు తగ్గించాలని లేకపోతే.. ఇతర న్యాయవాదులు వెళ్లిపోయే అవకాశం ఉందన్నారు.
ఏం జరిగిందంటే..
పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు ఈనెల 12న ఉప ఎన్నికల పోలింగ్ నిర్వహించారు. దీనిపై వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. మూడు కీలక విషయాలను లేవనెత్తింది.
1) ఆ ప్రాంతంతో సంబంధం లేని వారు ఓట్లు వేశారు.
2) నకిలీ ఓటర్లకు ఎన్నికల అధికారులు స్వయంగా స్లిప్పులు ఇచ్చారు.
3) వైసీపీ ఏజెంట్లను, అభ్యర్థిని కూడా పోలీసులు భయ భ్రాంతులకు గురి చేసి ఎన్నికల పోలింగ్‌ను భ్రష్టు పట్టించారు.
ఈ కారణాలతో సదరు పోలింగ్‌ను రద్దు చేసి.. మరోసారి స్వేచ్ఛగా ఎన్నికలు జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును వైసీపీ తరఫు న్యాయవాదులు కోరారు.
ఇక, టీడీపీ తరఫున న్యాయవాది.. కూడా బలమైన వాదనలే వినిపించారు.
1) ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకునే హక్కు హైకోర్టుకు లేదని తెలిపారు.
2) ఇప్పటికే ఎన్నికల ఫలితం కూడా వచ్చేసిందని.. ప్రజలు స్వేచ్ఛగా ఓటేశారని.. లేకపోతే, ప్రజలే ప్రశ్నించేవారు కదా? అని వాదనలు వినిపించారు. ఇలా.. ఇరు పక్షాలు ఒకరిని మించి మరొకరు అన్నట్టుగా వాదనలు వినిపించేసరికి.. హైకోర్టు పలు సందర్భాల్లో దద్దరిల్లింది. దీనిని ప్రస్తావిస్తూ.. ''బయట వర్షాలు మాత్రమే కురుస్తున్నాయి. ఇక్కడ మాత్రం మీరు సునామీ సృష్టిస్తున్నారు'' అని వ్యాఖ్యానించడం గమనార్హం.
అయితే.. ఈ సందర్భంగా న్యాయమూర్తి రాష్ట్ర ఎన్నికల అధికారులను ప్రశ్నించారు. నకిలీ ఓటర్లు వస్తే.. వారిని అడ్డుకునేందుకు మీరేం చర్యలు తీసుకున్నారు?
2) గుర్తింపు కార్డులను పరిశీలించే ఓటర్లను అనుమతించారా?
3) పిటిషనర్లు చూపిస్తున్న ఫొటోల్లో వేరే ప్రాంతాలకు చెందిన వారు ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై మీరేమంటారు? అని ప్రశ్నించారు. దీనిపై వాదనలకు మధ్యాహ్నం వరకు సమయం కోరడంతో అనంతరం దీనిపై తీర్పును కూడా అప్పుడే వెలువరిస్తామని చెప్పారు.
