Begin typing your search above and press return to search.

బీసీ రిజర్వేషన్లు...పార్టీల కోర్టులోకి !

ఎన్నికలు పోటీ పోటీగా సాగుతున్నపుడు, లేదా ఒకే పార్టీలో పలువురు అభ్యర్ధులు ఒక సీటుని ఆశిస్తున్నపుడు ఆయా చోట్ల బీసీ రిజర్వేషన్లు అమలు చేయడం ఏ మేరకు సాధ్యపడుతుంది అన్నది చూడాల్సి ఉంటుంది.

By:  Satya P   |   1 Oct 2026 1:00 PM IST
బీసీ రిజర్వేషన్లు...పార్టీల కోర్టులోకి !
X

ఏపీలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన రెండు జీవోలను హైకోర్టు కొట్టేసింది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదు అని కోర్టు తీర్పు చెప్పింది. ఎస్సీ, ఎస్టీ, బీసీల మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదు అని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన కృష్ణమూర్తి కేసు తీర్పును హైకోర్టు ఈ సందర్భంగా గుర్తుచేసింది. బీసీలకు 34 శాతం ఇస్తే, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లతో కలిపి మొత్తం కోటా దాదాపు 60 శాతానికి పైగా పెరుగుతుంది. ఇది రాజ్యాంగ విరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది. దీంతో ఇపుడు బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో దక్కుతాయా లేదా అన్నది అతి పెద్ద చర్చగా ముందుకు వస్తోంది.

పార్టీలే చేయాలి :

అయితే రిజర్వేషన్లు అన్నది అధికారికంగా చట్ట ప్రకారం ఇవ్వడానికి రాజ్యాంగపరమైన అడ్డంకులు ఉన్నపుడు పార్టీలే ఈ విషయంలో చొరవ తీసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. పార్టీలు తాము నిలబెట్టే అభ్యర్ధుల విషయంలో 34 శాతం రిజర్వేషన్లు కచ్చితంగా బీసీలకు ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకుంటే అది సాధ్యపడుతుందని అంటున్నారు. అయితే పార్టీలు రిజర్వేషన్లు అన్నపుడు అది రాజకీయ కోణంలో కూడా ఆలోచించాల్సి ఉంటుందని అంటున్నారు. దాంతో అది అంతటా జరిగి తీరుతుందా లేదా అన్నది వివిధ సమీకరణాల బట్టి ఆధారపడి ఉంటుందని అంటున్నారు.

పోటా పోటీగా :

ఎన్నికలు పోటీ పోటీగా సాగుతున్నపుడు, లేదా ఒకే పార్టీలో పలువురు అభ్యర్ధులు ఒక సీటుని ఆశిస్తున్నపుడు ఆయా చోట్ల బీసీ రిజర్వేషన్లు అమలు చేయడం ఏ మేరకు సాధ్యపడుతుంది అన్నది చూడాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒక పార్టీ సామాజిక న్యాయం కోసం రిజర్వేషన్లు ఇస్తూ బీసీకి అక్కడ చాన్స్ కల్పిస్తే మరో పార్టీ వేరే వారికి టికెట్ ఇస్తే అపుడు రాజకీయ సమీకరణలు మారుతాయని అంటున్నారు. ఎవరేమి చేసినా అంతిమంగా గెలుపు కోసమే కాబట్టి దానిని చుట్టూనే రాజకీయం నడుస్తుందని అంటున్నారు. ఇక రిజర్వేషన్ల అంశమే తీసుకుంటే అధికారికంగా వర్తించినపుడు అందరూ దానిని పాటిస్తారు. లేకపోతే ఒక పార్టీ నిలబెడితే మరో పార్టీ ఇంకో నిర్ణయం తీసుకోవచ్చు. అపుడు బీసీలకు అధికారం దక్కడం అన్నది పోటా పోటీగా సాగే రాజకీయం బట్టి ఆధారపడి ఉంటుంది.

చేసేందుకే సిద్ధం :

అయితే బీసీ రిజర్వేషన్ల విహ్సయంలో అధికార కూటమి అలాగే విపక్ష వైసీపీ పార్టీల పరంగా అమలు చేసేందుకు సిద్ధంగానే ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే జనాభాలో యాభై శాతం దాకా బీసీలు ఉన్నారు. దాంతో వారి మద్దతు కోసమైనా ఈ నిర్ణయం తీసుకోవచ్చు. అయితే ఒక బీసీ మీద బీసీ అభ్యర్ధినే నిలబెడితేనే ఎవరో ఒకరిని అధికారం అందలం దక్కుతుంది. అలా కాకుండా వేరే వారిని తెచ్చి నిలబెడితే మాత్రం ఫలితం ఎలా ఉంటుంది అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. ఏది ఏమైనా బీసీ రిజర్వేషన్ల విషయంలో తాము కట్టుబడి ఉన్నామని పార్టీలు అన్నీ చెబుతున్నాయి. ఇక్కడ పార్టీలతో పాటుగా అందులో ఉన్న నాయకులు మిగిలిన సామాజిక వర్గాలు కూడా సహకరించినపుడే వెనకబడిన వర్గాలు ముందు వరసలోకి వస్తాయని అంటున్నారు.