పెళ్ళికాని ప్రసాద్ లకు బిగ్ అలెర్ట్!
స్వేచ్ఛ కోసం మీరు పెళ్లిని వాయిదా వేసుకుంటే.. ఆ తర్వాత మానసిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ హెచ్చరిస్తున్నారు.
By: Madhu Reddy | 21 Jan 2026 6:00 PM ISTఆధునిక ప్రపంచంలో ఉరుకుల పరుగుల జీవితంలో వెంటనే పెళ్లి అంటే మనతోపాటు వచ్చే భాగస్వామిని పోషించడం అత్యంత కష్టంగా మారుతుంది అని.. చాలామంది సంపాదన పై ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా వయసు మీద పడుతున్నా.. సంపాదించాలనే ఆలోచనలో పెళ్లికి దూరం అవుతున్నారు ఇంకొంతమంది స్వేచ్ఛగా జీవించాలని.. మింగిల్ అవ్వడం కంటే సింగిల్ గా ఉండడమే బెటర్ అని ఆలోచిస్తూ పెళ్లిని వాయిదా వేస్తున్నారు. ఇంకొంతమంది జీవితంలో నచ్చిన వారు దొరకక.. సింగిల్ గా మిగిలిపోతున్నారు. అయితే 30 సంవత్సరాల వయసు దాటిన తర్వాత కూడా పెళ్లి చేసుకోకుండా ఉండే పెళ్లి కానీ ప్రసాదులకు ఇప్పుడు శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
స్వేచ్ఛ కోసం మీరు పెళ్లిని వాయిదా వేసుకుంటే.. ఆ తర్వాత మానసిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ హెచ్చరిస్తున్నారు. మరి ఇన్ని రోజులు స్వేచ్ఛగా , సింగిల్ గా బ్రతుకుదాం అనుకున్న పెళ్లికాని ప్రసాద్ లకు శాస్త్రవేత్తలు ఇచ్చిన జలక్ చూసి షాక్ అవుతున్నారనే చెప్పాలి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
విషయంలోకి వెళ్తే.. సిట్జర్ల్యాండ్ లోని యూనివర్సిటీ ఆఫ్ జూరిచ్ శాస్త్రవేత్తలు జర్మనీ , బ్రిటన్ కి చెందిన సుమారుగా 17వేల మంది యువతపై జరిపిన సుదీర్ఘ అధ్యయనంలో ఈ ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.ముఖ్యంగా ఈ 17వేల మంది యువత 16 ఏళ్ల నుండి 29 ఏళ్ల మధ్య వయసు ఉన్నట్లు సమాచారం. ఇకపోతే ఈ వయసు ఉన్న వారిపై పరిశోధనలు జరిపిన తర్వాత తేలిన విషయాలు ఏమిటంటే.. ఎవరైతే ఒంటరిగా ఉంటున్నారో.. తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్నారో.. అలాగే చదువుపై ఎక్కువ దృష్టి పెడుతున్నారో వారే ఎక్కువగా మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు..
20 సంవత్సరాల వయసు దాటిన తర్వాత ఒంటరిగా ఉన్నామనే ఫీలింగ్ వారిలో ఎక్కువగా కలుగుతుందట. ముఖ్యంగా ఈ సమస్యలు ఆడ, మగ ఇద్దరిలో కూడా సమానంగా ఉంటున్నట్లు అధ్యయనం తెలిపింది.ఇక గర్ల్ ఫ్రెండ్ లేదా బాయ్ ఫ్రెండ్ అంటూ రిలేషన్షిప్ మైంటైన్ చేసే వారిలోనూ అలాగే పెళ్లి చేసుకున్న వారిలోనూ సంతృప్తి పెరిగి వారిలో ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని.. అయితే ఎవరైతే ఒంటరిగా జీవితాన్ని కొనసాగిస్తున్నారో వారిలోనే ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయని శాస్త్రవేత్తలు చెప్పుకొచ్చారు. ఇకపోతే 30 ఏళ్లు దాటినా ఇంకా పెళ్లి చేసుకోని ఆడ మగ ఇద్దరిలో కూడా ఒంటరితనం ఎక్కువై .. అసంతృప్తి భావన కలిగి..మానసిక సమస్యల్లోకి నెట్టేస్తుందని అధ్యయనం తెలిపింది.
ఒంటరితనం వల్ల రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువేనట. అంతేకాదు ఒంటరితనం ఎక్కువైతే ఒత్తిడి పెరిగి ఆ ప్రభావం మానసిక సమస్యకు దారితీస్తుందని ..మరోవైపు ఆలస్యంగా వివాహం చేసుకుంటే పిల్లలు కలగడంలో కూడా ఆలస్యం ఏర్పడుతుందని.. ముఖ్యంగా సంతానోత్పత్తిలో సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనా ఒంటరితనంలో స్వేచ్ఛగా బ్రతకాలనుకున్న పెళ్లికాని ప్రసాదులకు ఈ అధ్యయనం భారీ షాక్ ఇచ్చిందని చెప్పాలి. అందుకే సింగిల్ గా ఉండడం కంటే మింగిల్ అయ్యి భాగస్వాములతో హాయిగా గడపాలని సూచిస్తున్నారు.
