Begin typing your search above and press return to search.

ఇండస్ట్రీలో విషాదం..సముద్రంలో పడి స్టార్ సింగర్ మృతి!

సినీ ఇండస్ట్రీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తాజాగా ఒక స్టార్ సింగర్ సముద్రంలో పడి ప్రాణాలు విడవడంతో అభిమానులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు.

By:  Madhu Reddy   |   19 Sept 2025 5:13 PM IST
ఇండస్ట్రీలో విషాదం..సముద్రంలో పడి స్టార్ సింగర్ మృతి!
X

సినీ ఇండస్ట్రీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తాజాగా ఒక స్టార్ సింగర్ సముద్రంలో పడి ప్రాణాలు విడవడంతో అభిమానులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఆ స్టార్ సింగర్ ఎవరు? అసలు ఏమయింది? ప్రమాదం జరగడానికి గల కారణం ఏంటి? ఇలా కొన్ని విషయాలు వైరల్ గా మారుతున్నా యి.

అసలు విషయంలోకెళితే.. నార్త్ - ఈస్ట్ ఇండియా ఫెస్టివల్ ఈవెంట్ లో భాగంగా ఈనెల 20, 21న ప్రదర్శన ఇచ్చేందుకు ప్రముఖ బాలీవుడ్ సింగర్ అస్సాంకు చెందిన జుబీన్ గార్గ్ (52) సింగపూర్ కి వెళ్లారు. అక్కడ స్కూబా డైవింగ్ చేస్తూ ఉండగా ప్రమాదవశాత్తు సముద్రంలో పడిపోయారు. అయితే వెంటనే ఆయనను సింగపూర్ పోలీసులు రక్షించి సమీపంలోని ఆసుపత్రికి తరలించి, ఐసీసీలో ఉంచినప్పటికీ వైద్యులు ఆయన ప్రాణాలను కాపాడలేకపోయారు. ఈ ఘటన బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదాన్ని నింపింది. ముఖ్యంగా భారతదేశ సంగీత ప్రపంచంలో ఒక లోతైన శూన్యతను మిగిల్చింది అని అభిమానులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈశాన్య ప్రాంతాలతో పాటు అస్సాం తదితర ప్రాంతాల అభిమానులు, సెలబ్రిటీలు ఈయన మృతి పట్ల నివాళులు అర్పిస్తూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

జుబీన్ గార్గ్ విషయానికి వస్తే.. అస్సాంలో ఫేమస్ సింగర్ గా పిలవబడే ఈయన.. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న 'ఓజీ' సినిమాలో విలన్ నటిస్తున్న ఇమ్రాన్ హస్మి గతంలో నటించిన 'గ్యాంగ్ స్టర్' మూవీలో ' యా అలీ' అనే పాట పాడి జాతీయస్థాయి గుర్తింపును సొంతం చేసుకున్నారు. అప్పట్లో ఈ సాంగ్ ఇండియా మ్యూజిక్ ఆల్బమ్స్ లో చార్ట్ బస్టర్ గా నిలిచింది. అలాగే 'క్రిష్ 3' సినిమాలో "దిల్ తు హి బాట", 'ప్యార్ కే సైడ్ ఎఫెక్ట్స్' సినిమాలో "జానే క్యా చాహే మాన్" లాంటి పాటలతో బాలీవుడ్ లో స్టార్ సింగర్ గా పేరు సొంతం చేసుకున్నారు. హిందీతో పాటు అస్సామీ, నేపాలీ , బెంగాలీ అలాగే ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా పాటలు పాడి మంచి గుర్తింపు దక్కించుకున్న ఈయనకు.. ఇండియాతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా కూడా అభిమానులు ఉన్నారు. అలాంటి ఈయన ఇప్పుడు ప్రమాదవశాత్తు మరణించడంతో అభిమానులు సైతం తట్టుకోలేకపోతున్నారు.

ఇకపోతే ఈయన మరణం పై మాజీ రాజ్యసభ ఎంపీ రిపు బోరా ఎక్స్ లో సంతాపం వ్యక్తం చేశారు. "మన సాంస్కృతిక దిగ్గజం జుబీన్ గార్గ్ అకాల మరణంతో తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఎంతో బాధపడ్డాను. ఆయన స్వరం , సంగీతం అజేయమైన స్ఫూర్తి అస్సాంలో మాత్రమే కాకుండా బయట కూడా స్ఫూర్తినిచ్చాయి. ఆయన కుటుంబం, అభిమానులు, ప్రియమైన వారికి నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను" అంటూ ఆయన తెలిపారు. మొత్తానికైతే ఒక గొప్ప సింగర్ ఇలా ప్రమాదవశాత్తు సముద్రంలో పడి మరణించడాన్ని అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు.